close
Choose your channels

అవసరానికో అబద్ధం సెన్సార్ పూర్తి..!

Thursday, August 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోకేష్‌, రాజేష్, శ‌శాంక్, గీతాంజ‌లి, సందీప్, వెంకీ, ఎం.జి.ఆర్, గిరిధర్, విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా సురేష్ కె.వి తెర‌కెక్కించిన చిత్రం అవ‌స‌రానికో అబ‌ద్ధం. ఈ చిత్రాన్ని విజ‌య్, పులి శ్రీకాంత్, సందీప్ సంయుక్తంగా నిర్మించారు.ఇటీవ‌ల‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న ల‌భించింది. హ‌ర్ర‌ర్ కాన్సెప్ట్ తో రూపొందిన అవ‌స‌రానికో అబ‌ద్ధం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో పాటు సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్స్ ద‌ర్శ‌కుడు సురేష్ కె.విని అభినందించ‌డం విశేషం. ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 26న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.