close
Choose your channels

బాలయ్య సాంగ్

Monday, July 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రం `పైసా వ‌సూల్‌` శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా న‌ల‌బై రోజుల పాటు పోర్చుగ‌ల్ షెడ్యూల్‌ను యూనిట్ వ‌ర్గాలు పూర్తి చేసుకుని వ‌చ్చింది. ఏ మాత్రం షెడ్యూల్ గ్యాప్ లేకుండా వెంట‌నే అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ స్టూడియోలో ఏ సెట్ వేశారు.

ఈ సెట్‌లో బాల‌కృష్ణ‌, శ్రియా శ‌ర‌న్‌ల‌పై సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ వెంట‌నే కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 102వ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసేస్తాడట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కూడా స్టార్ట‌య్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.