close
Choose your channels

స‌రికొత్త లుక్‌లో బెల్లంకొండ హీరో .. కొత్త సినిమా లుక్ అదేనా!

Monday, November 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌రికొత్త లుక్‌లో బెల్లంకొండ హీరో .. కొత్త సినిమా లుక్ అదేనా!

హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్ల త‌ర్వాత `రాక్ష‌సుడు` అనే రీమేక్ సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. అయితే ఆ స‌క్సెస్ త‌ర్వాత వెంట‌నే సినిమా చేసేయాల‌ని కాకుండా కాస్త గ్యాప్ తీసుకుంటూ వచ్చాడు. ఈలోపు ఆయ‌న ప‌లువురు ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర క‌థ‌లు విన్నాడు. కందిరీగ‌, ర‌భ‌స చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ ఖ‌రారు చేయ‌లేదు.

అయితే తాజా స‌మాచారం మేర‌కు బెల్లంకొండ శ్రీనివాస్‌, సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా ఖ‌రారైంది. న‌వంబ‌ర్ 29న ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. అందుకోసం మేకోవ‌ర్ అయ్యి .. 8 ప్యాక్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆయ‌న లుక్ కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ కెమెరా మెన్ డూడ్లీ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుంటే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారట‌. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.