close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ కోరుకున్నది ఇదే.. అదరగొట్టేసిన సన్నీ, కాజల్ కన్నీళ్లు

Wednesday, December 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ కోరుకున్నది ఇదే.. అదరగొట్టేసిన సన్నీ, కాజల్ కన్నీళ్లు

బిగ్‌బాస్ 5 తెలుగులో సిరి, షణ్ముఖ్‌లు మరోసారి గొడవ పడ్డారు. హౌస్‌లో ఐకానిక్ ఎపిసోడ్స్‌గా చెప్పుకుంటున్న పరిస్ధితులను మరోసారి రిపీట్ చేశారు కంటెస్టెంట్స్. ఇందులో గొడవలు, ఫన్నీ ఇన్సిడెంట్స్ వున్నాయి. ఇక్కడ సన్నీ చేసిన యాక్టింగ్‌తో షన్నూకి చిర్రెత్తుకొచ్చింది. ఇక సన్నీ ఏకంగా ప్రియాంక క్యారెక్టర్ చేసి అలరించాడు. మరి ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ కోరుకున్నది ఇదే.. అదరగొట్టేసిన సన్నీ, కాజల్ కన్నీళ్లు

ఎపిసోడ్ ప్రారంభమవ్వగానే.. బిగ్ బాస్ లగ్జరీ ఐటెం టాస్క్ ఇచ్చారు. దీనిలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న గులాబ్ జామున్‌ల డబ్బాను చేతితో ముట్టుకోకుండా.. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఒక స్పెషల్ లగ్జరీ బడ్జెట్ ఐటెం దక్కుతుందని అనౌన్స్ చేశాడు. ఈ టాస్క్‌ను సిరి అందరికంటే ముందుగా పూర్తి చేసి షాకిచ్చింది. దీనికి గిఫ్ట్‌గా ఫ్రైడ్ చికెన్ ఐటెం పొందింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ కోరుకున్నది ఇదే.. అదరగొట్టేసిన సన్నీ, కాజల్ కన్నీళ్లు

అనంతరం కంటెస్టెంట్స్‌కి ‘‘రోల్ ప్లే టాస్క్ ’’ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు వేరే సభ్యుల్లా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో.. వారికి ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగే ఛాన్స్ వస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. ముందుగా ఈ సీజన్‌లో బాగా హైలైట్ అయిన సన్నీ-సిరిల ‘‘అప్పడం’’ టాస్క్‌ను ఇచ్చారు. ఇందులో సన్నీ.. షణ్ముఖ్‌గా, సిరి.. సన్నీగా, షణ్ముఖ్.. సిరి పాత్రలో, మానస్.. యానీ మాస్టర్ గా, శ్రీరామ్.. కాజల్ గా నటించారు. సన్నీ అయితే... తన పర్మార్మెన్స్‌తో తెగ నవ్వించేశాడు. ఛాన్స్ దొరికితే చాలు... సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని గట్టిగా హగ్‌ చేసుకుంటూ ఎంటర్‌టైన్ చేశాడు. దీనికి మండిపోయిన షన్నూ.. క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి, ‘‘వెకిలి కామెడీ ’’ ఏంటంటూ సన్నీకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సన్నీ బదులిస్తూ.. 'ఫన్ కోసం అలా చేశానని, నిన్ను హర్ట్ చేసే ఉద్దేశం లేదని' చెబుతూ.. షణ్ముఖ్‌ సారీ చెప్పి హగ్ చేసుకున్నాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ కోరుకున్నది ఇదే.. అదరగొట్టేసిన సన్నీ, కాజల్ కన్నీళ్లు

ఆ తరువాత ప్రియాంక-మానస్‌ల మధ్య జరిగిన జర్నీని ప్లే చేయమని చెప్పారు బిగ్ బాస్. సన్నీ.. ప్రియాంక గెటప్ వేస్తానని చెప్పగా.. వెంటనే కాజల్.. మానస్ క్యారెక్టర్ తీసుకుంది. సన్నీకి లంగావోణీ కట్టి, విగ్గు పెట్టి, లిప్స్టిక్ రాసి ప్రియాంక లాగా రెడీ చేశారు. శ్రీరామ్‌లా సిరి, జెస్సీలా షణ్ముఖ్‌, సిరిలా శ్రీరామ్‌ క్యారెక్టర్లు తీసుకున్నారు. టాస్క్ మొదలైన తర్వాత మానస్ గెటప్‌లో ఉన్న కాజల్ వెనక తిరుగుతూనే ఉన్నాడు సన్నీ. ఆ తరువాత 'మానస్ ఇప్పుడు ఐలవ్యూ పింకీ అని వంద సార్లు చెప్తాడు' అని డైలాగ్ వేసింది కాజల్. దానికి మానస్ సీరియస్ అవుతూ కాజల్, సన్నీలపై ఫైర్ అయ్యాడు. దీనికి బాగా హర్ట్‌ అయిన కాజల్‌.. మానస్‌ క్యారెక్టర్‌ చేయనని కరాఖండీగా చెప్పేసింది. సన్నీ .. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కాజల్‌ మనసు మార్చుకోలేదు. దీంతో టాస్క్ పూర్తి చేసేందుకు గాను.. సన్నీ మానస్‌ని పింకీ క్యారెక్టర్‌ చేయమని కోరగా దానికి ఆయన ఓకే చెప్పాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ కోరుకున్నది ఇదే.. అదరగొట్టేసిన సన్నీ, కాజల్ కన్నీళ్లు

అనంతరం పింకీగా మానస్‌ , మానస్‌గా సన్నీ గెటప్స్ మార్చుకున్నారు. పింకీ.. మానస్ నుంచి ఏం కోరుకునేదో.. అది ఈ టాస్క్‌లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు సన్నీ. మానస్ గెటప్‌లో ఉన్న సన్నీ ప్రేమగా అన్నం కలిపి.. పింకీకి తినిపించాడు. అలాగే 'నీతో ఎప్పటికీ స్నేహం చేస్తానని.. ఏం కష్టమొచ్చినా ముందుంటానని' చెప్పడంతో కాజల్ ఇది టాస్క్ అన్న విషయాన్ని మరిచిపోయి నిజంగానే ఎమోషనల్ అయింది. ముగ్గురూ ప్రేమగా కౌగిలించుకున్నారు. టాస్క్ ముగిసిన తర్వాత ప్రేక్షకులను ఓట్లు అడగటంపై షన్నూ- సిరి మాట్లాడుకుంటుండగా ఎపిసోడ్ ముగిసింది. మొత్తానికి ఈ టాస్క్‌లన్నింటిలో సన్నీ అదరగొట్టేశాడని చెప్పవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.