close
Choose your channels

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో బీహార్ ముఖ్య‌మంత్రి?

Wednesday, April 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో బీహార్ ముఖ్య‌మంత్రి?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కియారా అద్వాని కథానాయికగా న‌టిస్తోంది.  ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని బీహార్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అందులోనూ పొలిటికల్‌గా కథను టచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో.. ఓ ప్రతినాయక పాత్రని బీహార్ ముఖ్యమంత్రిగా చూపించనుండడం విశేషం.

నెగెటివ్ ట‌చ్‌తో ఉండే ఈ పాత్రలో బాలీవుడ్ న‌టుడు మహేశ్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఇక మెయిన్ విల‌న్‌గా మ‌రో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ న‌టిస్తున్నారు. ఈ ఇద్దరు విలన్‌లతో చరణ్ పాత్ర‌కి ఉన్న సంబంధ‌మే.. సినిమాలో కీల‌క‌మైన విష‌యంగా చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుందని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.