close
Choose your channels

‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ రగడ : కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి, సీఎం హత్యకు కుట్రపన్నారన్న ఆప్

Wednesday, March 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. అయితే ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు బుధవారం ఆందోళన చేశారు.

బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు తేజస్వీ సహా 40-50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బారీకేడ్లను దాటుకుని కొంతమంది బీజేపీ కార్యకర్తలు ముందుకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిపై జలఫిరంగులను ప్రయోగించారు. ఆ తర్వాత వారు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. పంజాబ్‌లో ఓటమిని తట్టుకోలేక కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుందన్నారు.

అసలు కేసీఆర్ ఏమన్నారంటే... ఢిల్లీ ప‌రిధిలో 'ద క‌శ్మీర్ ఫైల్స్' సినిమాకు వినోదపు ప‌న్ను రాయితీ క‌ల్పించాల‌ని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌.. కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్న రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారంటూ ఫైరయ్యారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరికీ అందుబాటులో వస్తుందని... ఉచితంగా చూడొచ్చునని కేజ్రీవాల్ అన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.