close
Choose your channels

బాలీవుడ్ విల‌న్‌తో బాల‌కృష్ణ‌..?

Friday, May 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ విల‌న్‌తో బాల‌కృష్ణ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం షూటింగ్‌ను ఆపేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌న్‌ను కూడా తీసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ విల‌న్ బాలీవుడ్ నుండి తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ని టాక్‌. త‌న గ‌త రెండు చిత్రాల త‌ర‌హాలో ఈ సినిమాలో బోయ‌పాటి భారీ యాక్ష‌న్ సీన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ క‌రోనా క్వారంటైన్ టైమ్‌లో సినిమా స్క్రిప్ట్‌కు మ‌రింత‌గా మెరుగులు దిద్దుతున్నాడ‌ట బోయపాటి. ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడ‌ట‌. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో భూమిక లేడీ విల‌న్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.