close
Choose your channels

'బ్రహ్మోత్సవం' రిలీజ్ డేట్ ఫిక్స్..

Friday, November 6, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్నతాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించే ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. బంధాలు..అనుబంధాలు నేప‌థ్యంతో విజ‌య‌వాడ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ బ్ర‌హ్మోత్స‌వం సినిమా తిరుప‌తిలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వం స‌న్నివేశంతో శుభం కార్డ్ ప‌డుతుంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 8 వ‌ర‌కు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.