close
Choose your channels

బ్రిటన్ పార్లమెంట్లో మెహన్ బాబుకు అరుదైన గౌరవం

Thursday, May 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రముఖ టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు మోహన్‌బాబుకు అరుదైన గౌరవం దక్కింది. మోహన్‌బాబు కెరీర్‌లో బెస్ట్ డైలాగ్స్‌తో కూడిన పుస్తకాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఏషియన్ లైట్ 10వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.
ఏషియన్ లైట్ (న్యూస్ పేపర్) బ్రిటన్‌లో భారతీయ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్రిటన్ లో తెలుగు భాషలో నాన్ బ్రిటీషీ రచయిత రాసిన పుస్తకాన్ని విడుదల చేయడం ఇదే మొదటిసారి అని ఏషియన్ లైట్ ఎడిటర్ అజీజ్ అనసుదీన్ తెలిపారు. భారత సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు విద్యా, క్రీడా రంగాల్లో చేసిన సేవలకుగానూ హారో ఈస్ట్ ఎంపీ (బ్రిటన్)బాబ్ బ్లాక్‌మన్ మోహన్‌బాబుకు ప్రణమ్ అవార్డును ప్రదానం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.