close
Choose your channels

‘సైమా’కు ముఖ్యఅతిథులుగా చిరు, మోహన్‌లాల్

Wednesday, July 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘సైమా’కు ముఖ్యఅతిథులుగా చిరు, మోహన్‌లాల్

పాంట‌లూన్స్ సైమా (సౌత్ ఇండియన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) ఎనిమిద‌వ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. కాగా ఇలా పాంట‌లూన్స్ అవార్డుల టైటిల్‌ను స్పాన్సర్ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇప్పటికే.. అభిమాన తార‌లు, సినీ ప్రముఖులు ఒకే వేదిక‌పై సంద‌డి ఈ సైమా వేడుక‌కు రంగం నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కాగా ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హాజరుకాబోతున్నారు. ఈ మేరకు సైమా అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

కాగా ఈ వేడుకలకు ఖ‌త‌ర్‌లోని దోహా వేదిక కానుందని తెలుస్తోంది. రెండ్రోజుల పాటు జ‌రుగ‌నున్న వేడుక‌ల‌కు ద‌క్షిణాదికి చెందిన నాలుగు భాష‌ల సినీ ప్రముఖులు హాజ‌రు కాబోతున్నారు.

సైమా అవార్డ్స్ టాప్ నామినేషన్స్ లిస్ట్
తెలుగులో టాప్ నామినేష‌న్స్
1. రంగ‌స్థలం: 12 నామినేష‌న్స్
2. మ‌హాన‌టి: 9 నామినేష‌న్స్
3. గీత గోవిందం: 8 నామినేష‌న్స్
4. అర‌వింద స‌మేత‌: 6 నామినేష‌న్స్‌లో ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.