close
Choose your channels

CM Ramesh: కాంగ్రెస్‌కు సీఎం రమేష్ రూ.30కోట్ల విరాళం..? కమలం పార్టీలో కలకలం..

Saturday, March 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంగ్రెస్‌కు సీఎం రమేష్ రూ.30కోట్ల విరాళం..? కమలం పార్టీలో కలకలం..

ఏపీ ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన స్వార్థ రాజకీయాల కోసం ఎలాంటి కుట్రలైనా చేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో సార్లు ఇది నిరూపితమైంది. తాజాగా బయటపడిన ఎలక్టోరల్ బ్యాండ్స్ వ్యవహారం అయితే సంచలనంగా మారింది. చంద్రబాబుకు నమ్మకమైన శిష్యుడిగా, అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న సీఎం రమేష్ పేరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే తన శిష్యుడు సీఎం రమేష్‌ను బీజేపీలోకి పంపించిన సంగతి తెలిసిందే. నారా వారి ప్రయోజనాలు చక్కపెట్టడం ప్రారంభించారని పలువురు చెబుతూ ఉంటారు. టీడీపీ- బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయడానికి సీఎం రమేష్ తెరవెనుక చేయాల్సిందంతా చేశారని కమలం నేతలు వెల్లడిస్తున్నారు. అలాంటి సీఎం రమేష్ బీజేపీలో ఉంటూనే ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌కు రూ.30కోట్లు తన రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.

2023లో తన కంపెనీ ద్వారా రూ.45కోట్ల బాండ్స్ కొన్న సీఎం రమేష్ కాంగ్రెస్‌కు రూ.30కోట్లు ఇవ్వగా.. మరో కర్ణాటక పార్టీ అయిన జేడీఎస్‌కు కూడా రూ.10కోట్లు.. ఇక తన మాతృపార్టీ తెలుగుదేశంకు రూ.5కోట్ల విరాళం ఇచ్చారు. కేవలం ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారానే తన శిష్యుడు ద్వారా కాంగ్రెస్‌కు రూ.30కోట్లు అప్పజెప్పిన బాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు అందించారో అంటూ పలు ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో తలెత్తుతున్నాయట.

కాంగ్రెస్‌కు సీఎం రమేష్ రూ.30కోట్ల విరాళం..? కమలం పార్టీలో కలకలం..

సీఎం రమేష్‌కు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ద్వారానే కాంగ్రెస్‌కు రూ.30 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను అందించారు. ఒక్కో బాండ్ విలువ రూ.కోటి కాగా మొత్తం 30 బాండ్లను హస్తం పార్టీకి అందజేశారు. ఆయన అందించిన ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు 14402, 14412, 14414, 14416,14418, 14420,14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477 అని తెలుస్తోంది.

ఈ వ్యవహారాలు చూస్తుంటే చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తెర వెనుక హస్తం పార్టీతో టచ్‌లో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను చెప్పినట్లుగా ఆడేందుకు ఈ విధంగా కాంగ్రెస్‌కు ప్యాకేజీ పంపి ఉంటారని అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా కుట్ర రాజకీయాలకు తెర తీసిన చంద్రబాబు తాను కేసుల నుంచి బయటపడటం కోసం అధికారికంగా కమలం పార్టీతో.. తాను చెప్పింది జరిగేలా అనాధికారికంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని తెలుస్తోంది.

దీంతో వైఎస్ షర్మిల నేరుగా టీడీపీలో చేరితే ఎవరు నమ్మరని.. శిష్యుడు రేవంత్ రెడ్డి చేత షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనమయ్యేలా ప్లాన్‌ చేశారంటున్నారు. ఆ తర్వాత ఆమెను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు వదిలిన బాణంగా షర్మిల రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి జగనే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్‌కు సీఎం రమేష్ రూ.30కోట్ల విరాళం..? కమలం పార్టీలో కలకలం..

ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్‌ని ఢీకొట్టలేమని గ్రహించిన చంద్రబాబు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును అడ్డుపెట్టుకుని ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వివేకా కుమార్తె సునీతారెడ్డిని చెరదీశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అధికారం ఆశ చూపెట్టి షర్మిలను సైతం తనవైపు తిప్పుకున్నాడని చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఆమె కడప పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నారని సమాచారం.

మరోవైపు షర్మిల, జనసేనాని పవన్ కల్యాణ్ సహా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్‌దే కావడం గమనార్హం. ఎందుకంటే సీఎం రమేష్ బీజేపీలో ఉన్నా నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషేనని అందరూ భావిస్తారు. అయితే హస్తం పార్టీకి భారీ స్థాయిలో విరాళం ఇచ్చిన సంగతి బట్టబయలు కావడంతో టీడీపీ, కాంగ్రెస్ మధ్య సంబంధం ఏంటనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అటు కమలం పార్టీలోనూ దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న సీఎం రమేష్‌కు టికెట్ ఇవ్వడంపై బీజేపీ పెద్దలు పునరాలోచన చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.