close
Choose your channels

కమల్ పై దళిత సంఘం ఆగ్రహం...

Tuesday, June 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, శృతిహాసన్, రమ్యకృష్ణల కాంబినేషన్ లో శభాష్ నాయుడు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ ఇప్పుడు వివాదస్పదమైంది. కోయంబత్తూర్ చెందిన దళిత్ అసోసియేషన్ ఈ సినిమా టైటిల్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

టైటిల్ ఓ వర్గాన్ని మాత్రమే బలపరిచి మిగిలిన కులాలను కించపరిచేలా ఉందని, టైటిల్ ను మార్చాలంటూ వారు ఆ కంప్లైంట్ లో పెర్కొన్నారు. అయితే దీనిపై కమల్ వర్గం నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. మరి లాస్ ఏంజిల్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కమల్ ఏమని స్పందిస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.