close
Choose your channels

'డిక్టేటర్' ఎటువైపు?

Wednesday, October 14, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి బాల‌కృష్ణ ముచ్చ‌ట‌గా ముగ్గురు క‌థానాయిక‌ల‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయ‌డం అనే ట్రెండ్ 'స‌మ‌ర‌సింహా రెడ్డి'తో ఊపందుకుంది. ఆ త‌రువాత 'సుల్తాన్‌, న‌ర‌సింహ‌నాయుడు, విజ‌యేంద్ర వ‌ర్మ‌, ఒక్క మ‌గాడు, సింహా, ప‌ర‌మ‌వీర చ‌క్ర' సినిమాలూ ఇవే బాట ప‌ట్టాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిన తాజా చిత్రం 'డిక్టేట‌ర్‌'. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా కోసం బాల‌య్య‌తో అంజ‌లి, సోనాల్ చౌహాన్‌, అక్ష ఆడిపాడుతున్నారు.

సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ముగ్గురు హీరోయిన్స్‌తో బాల‌కృష్ణ రొమాన్స్ చేసిన చిత్రాల్లో 'స‌మ‌ర‌సింహా రెడ్డి', 'న‌ర‌సింహ‌నాయుడు' సంక్రాంతి సంద‌ర్భంగానే విడుద‌లై స‌క్సెస్ అయితే.. 'ఒక్క మ‌గాడు', 'ప‌ర‌మ వీర చ‌క్ర' అదే సీజ‌న్‌లోనే రిలీజై ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో 'డిక్టేట‌ర్' ఫ‌లితం ఎటువైపు మొగ్గుతుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.