close
Choose your channels

'డిక్టేటర్' ఆడియో విడుదల

Monday, December 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ డిక్టేటర్‌`. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌.లౌక్యం`వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నిర్వహించారు.

నందమూరి బాలకృష్ణ, ఎం.పీ రాయపాటి సాంబశివరావు, రాజకీయ ప్రముఖులు పత్తిపాటి పుల్లారావు, రావెళ్ళ కిషోర్ బాబు, శ్రవణ్ కుమార్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్, దర్శకుడు శ్రీవాస్, ఈరోస్ వైస్ ప్రెసిడెంట్ చింటు, అంజలి,సోనాల్ చౌహాన్, కోనవెంకట్, గోపిమోహన్, శ్రీధర్ సీపాన, అనీల్ సుంకర, రామ్ అచంట, గోపి అచంట, ఎస్.ఎస్.థమన్ సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఎంపీ రాయపాటి సాంబశివరావు విడుదల చేయగా తొలి సీడీని నందమూరి బాలకృష్ణ అందుకున్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ `అమరావతి గౌతమబుద్ధుడు నడిచిన నేల. ఎందరో రాజులు పాలించిన ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో డిక్టేటర్ ఆడియో వేడుక జరగడం ఆనందంగా ఉంది. థమన్ మంచి సంగీతాన్నిచ్చాడు. శ్రీవాస్ మంచి ప్రణాళికతో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాడు. డిక్టేటర్ అనే టైటిల్ నా స్వభావానికి దగ్గరగా ఉంటుంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నాం`` అన్నారు.

శ్రీవాస్ మాట్లాడుతూ `లౌక్యం సినిమా తర్వాత బాలకృష్ణగారిని కలసి చాలా రోజుల నుండి సినిమా చేద్దామని అనుకుంటున్నాం సార్ అని అడగ్గానే వెంటనే ఆయన సినిమా చేద్దామని అన్నారు. బాలయ్య బాబుతో సినిమా అనగానే ఆయన అభిమానులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో ఒక అభిమానిగా ఉహించాను. కోనవెంకట్, గోపీమోహన్, శ్రీధర్ సీపాన, రత్నం ఈ సినిమా కోసం కలిసి కట్టుగా పనిచేసే పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేశారు. బాలయ్యబాబుగారితో జర్నీ మరచిపోలను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.

ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ `బాలకృష్ణగారి 99వ సినిమా ఆడియో విడుదల నూతన రాజధానిలో జరగడం ఆనందంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ `నేను చిన్నప్పుడు భైరవద్వీపం సినిమా మ్యూజిక్ ట్రూప్ లో వర్క్ చేశాను. అలా సంగీతం జర్నీ స్టార్టయింది. ఇప్పుడు ఆయన 99వ సినిమాకు నేనే మ్యూజిక్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. డిక్టేటర్ సినిమాకు సంగీతం చేయడం పెద్ద బాధ్యతగా ఫీలై చేశాను`` అన్నారు.

అనీల్ సుంకర మాట్లాడుతూ `డిక్టేటర్ టైటిల్ తో సినిమా చేయగల హీరో ఎవరైనా ఉన్నారా అని చూస్తే అది బాలయ్య బాబు మాత్రమే. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి`` అన్నారు.

అంజలి మాట్లాడుతూ బాలయ్యగారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మంచి కోస్టార్. ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ `బాలకృష్ణగారితో లెజెండ్ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ఇది. అవకాశం ఇచ్చిన బాలకృష్ణ, దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్ రాజకీయ ప్రముఖులు కూడా డిక్టేటర్ ఆడియో పెద్ద సక్సెస్ కావాలని యూనిట్ ను అబినందించారు.

సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.