close
Choose your channels

ఏ హాలీవుడ్ మూవీ గుర్తుకు రాద‌ట‌

Friday, November 27, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'మ‌నం' చిత్రంతో స‌రికొత్త అనుభూతిని అందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌. ఇత‌ని సినిమాలంటే.. వైవిధ్యానికి చిరునామాలుగా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ చేస్తున్న చిత్రం '24'. సూర్య‌, స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్న ఈ సినిమా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో వేస‌వి కానుకగా విడుద‌ల కానుంది. సైంటిఫిక్ ఫిక్ష‌న్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. సినీ ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుందని విక్ర‌మ్ చెప్పుకొస్తున్నాడు.

అంతేకాదు.. ఈ సినిమా చూసి ఇదేదో హాలీవుడ్ మూవీకి కాపీ పేస్ట్‌లా ఉందే.. అనే ఫీలింగ్ కూడా రానంత కొత్త‌గా '24' ఉంటుంద‌ని విక్ర‌మ్ న‌మ్మ‌కంగా చెబుతున్నాడు. అత‌ని గ‌త చిత్రాల దృష్ట్యా విక్ర‌మ్ మాట‌ని న‌మ్మొచ్చు కాబ‌ట్టి.. మ‌నం కూడా ఓ హాలీవుడ్ స్థాయి మూవీని చూసేందుకు సిద్ధ‌మైపోవ‌చ్చ‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.