close
Choose your channels

కేంద్రం కొత్త ప్రయోగం: కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్!

Friday, August 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఓ దమ్మున్న వ్యక్తిని పంపాలని కేంద్రం యోచిస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్ పేరు ప్రముఖంగా వినపడింది. ఇప్పటికే ఆయన్ను నియమించేశారని.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారం అనంతరం జమ్మూ కశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా వెళ్లిపోతారని వార్తలు వినవచ్చాయి. అయితే తాజాగా.. అవన్నీ తూచ్ అంటూ మరో సెన్సేషనల్ వార్త షికారు చేస్తోంది.

తూచ్.. నరసింహన్ కాదు.. విజయ్!
చరిత్రలో ఫస్ట్ టైమ్ ఒక ఐపీస్ ఆఫీసర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టిన మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ డేర్ అండ్ డ్యాషింగ్ ఆఫీసర్ అయితే కశ్మీర్‌ లోయలో నానాటికి దిగజారిపోతున్న శాంతిభద్రతలను పరీరక్షించి.. ఉగ్రమూకల ఆటకట్టిస్తాడని ఈ చండశాసనుడిని కేంద్రం అక్కడికి పంపుతున్నట్లు తెలుస్తోంది.

ఎవరీ విజయ్!?
విజయ్ కుమార్‌ 1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయనకు పెద్ద సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. వీరప్పన్‌ను పట్టుకున్న తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు.. చెన్నై పోలీస్ కమీషనర్‌గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశారు. గతంలో బీఎస్ఎఫ్‌కు కశ్మీర్‌లో ఐజీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే.. సీఆర్‌పీఎఫ్ డిజీగా ఉన్న టైమ్‌లో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు వేగంగా ప్రయాణించడానికి వీలుగా రహదారులను నిర్మించారు. దీని ఫలితంగా మావోల ఏరివేత సులభ సాధ్యమైంది.

ట్రాక్ రికార్డ్!!
ఇవన్నీ అటుంచితే హైదరాబాద్‌తో ఈయనకు సంబంధాలున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత డీజి, సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేసి పదవీ విరమణ అయ్యారు. ఆ తర్వాత కూడా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం, హోమ్, ఫారెస్ట్, ఎకాలజీ & ఎన్విరాన్మెంట్, హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్, యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, హాస్పిటాలిటీ & ప్రోటోకాల్, సివిల్ ఏవియేషన్, ఎస్టేట్స్ మరియు ఇన్ఫర్మేషన్ పోర్ట్‌ఫోలియోలతో జమ్ముకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా ఉన్నారు. ఇంతటి ఘనత విజయ్‌కు మాత్రమే సాధ్యమైంది. అందుకే ఇంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న విజయ్‌ను కశ్మీర్‌కు పంపితే సమర్థవంతంగా చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.