close
Choose your channels

'కాలా' విడుద‌ల తేదీ పై క‌థ‌నాలు

Sunday, April 8, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాలా విడుద‌ల తేదీ పై క‌థ‌నాలు

సూపర్ స్టార్ రజనీ కాంత్, డైరెక్టర్ పా.రంజిత్ కలయికలో తెరకెక్కిన చిత్రం 'కాలా'. రజనీ అల్లుడు, నటుడు ధనుష్  వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు. మాఫియా డాన్‌గా రజనీ నటించిన‌ ఈ చిత్రానికి.. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్‌లో ఈ సినిమా విడుదలపై కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అవేమిటంటే.. ఈ నెల 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ప్రస్తుతం కోలీవుడ్‌లో జరుగుతున్న సమ్మె కారణంగా  జూన్ 12వ తేదీకి వాయిదా ప‌డినట్టు చెప్పుకుంటున్నారు.

ఒకవేళ ఇదే నిజమైతే ఆ తేదీలో సినిమాలను రిలీజ్ చేయాలనుకునే నిర్మాతలు.. 'కాలా' కార‌ణంగా వారి చిత్రాల విడుదల తేదీల్లో మార్పుచేసుకోక తప్పదని తమిళ పరిశ్రమలో ముచ్చ‌టించుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కార‌ణంగా టాలీవుడ్‌లో మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేసుకున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఈ సినిమా వాయిదా పడితే మాత్రం.. రజనీ అభిమానులు మ‌రోసారి నిరాశ ప‌డుతారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.