close
Choose your channels

రవితేజ మూవీలో హీరోయిన్ ఫిక్స్..!

Saturday, January 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ రాజా ర‌వితేజ కొంత గ్యాప్ త‌ర్వాత రెండు సినిమాల‌ను ఎనౌన్స్ చేసారు. ఇందులో ఒక‌టి ట‌చ్ చేసి చూడు, రెండు రాజా ది గ్రేట్. ముందుగా ట‌చ్ చేసి చూడు సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రం ద్వారా విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.
ఈ మూవీ ద్వారా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్రీత‌మ్ టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్నారు. అయితే...ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీని ఎనౌన్స్ చేసారు కానీ..ఇందులో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఎనౌన్స్ చేయ‌లేదు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టించ‌నుంద‌ని స‌మాచారం. లావ‌ణ్య ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ తో క‌లిసి మిస్ట‌ర్ సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్రాన్నికి కూడా నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జే. అందుక‌నే అనుకుంట ర‌వితేజ మూవీకి కూడా లావ‌ణ్య‌నే ఫిక్స్ చేసార‌ని తెలిసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.