close
Choose your channels

'అర్జున్ రెడ్డి' నుండి త‌ప్పుకున్న హీరోయిన్‌?

Saturday, September 8, 2018 • తెలుగు Comments

`అర్జున్ రెడ్డి` నుండి త‌ప్పుకున్న హీరోయిన్‌?

తెలుగులో గ‌త ఏడాది ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. క‌ల్ట్ మూవీ అంటూ అందరితో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం త‌మిళంలో, హిందీలో రీమేక్ అవుతున్నాయి. హింధీ విష‌యానికి షాహిద్ క‌పూర్ అర్జున్‌రెడ్డిగా న‌టిస్తున్నాడు. ఇత‌నికి జోడిగా తారా సుతైరాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ముందు ఒకే చెప్పింది.

ఈ సినిమాతో పాటు తారా క‌ర‌ణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 సినిమాలో కూడా న‌టించాల్సి ఉంది. ఈ  రెండు సినిమాల డేట్స్ క్లాష్ వ‌స్తుండ‌టంతో అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ స్టార్ట్ కాకుండా ఆల‌స్యం కావ‌డంతో హీరోయిన్‌కు స‌మ‌స్య వ‌చ్చింద‌ని.. అందుకనే తారా త‌ప్పుకుంద‌ని టాక్‌.