close
Choose your channels

అలీ ముఖంపై తన్నిన హిమజ!

Thursday, August 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అలీ ముఖంపై తన్నిన హిమజ!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-3 ఎపిసోడ్.. ఎపిసోడ్‌కు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. రోజురోజుకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 7 ఎపిసోడ్‌‌లు ముగించుకుని.. బుధవారం నాడు 18వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌లు కొన్ని కాంట్రవర్సీ, మరికొన్ని ఎమోషన్స్‌తో ముగియగా.. తాజాగా జరిగిన ఎపిసోడ్ ఓవరక్షాన్, అతితో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇందుకు కారణాలు చాలనే ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్ తమన్నా బిహేవియర్‌.. అలీ రెజా-హిమజా మధ్య జరిగిన వివాదమే. తాజా ఎపిసోడ్‌లో.. శ్రీముఖి, రవిక్రిష్ణ, అషు రెడ్డి తదితరులు దొంగలుగా ఉండగా.. వాటిని కాపాడుకోవడం కోసం వరుణ్, రాహుల్, వితికా, తమన్నా, మహేష్ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులుగా ఉండగా.. హిమజ లాయర్‌గా ఉంది.

ఎగిరి తన్నిన హిమజ!

ఇక ఎపిసోడ్‌లో జరిగిన వివాదం విషయానికొస్తే.. హిమజ-అలీల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇంట్లో వాటర్ తాగడానికి వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. అయితే రెండోసారి మళ్లీ నీళ్లు తాగే ప్రయత్నంలో ఆమెను అడ్డుకున్న అలీ జేబులో చేయిపెట్టి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేసి ఆమె ఫిజికల్ ఎటాక్ చేయబోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన హిమజ.. ఒక్కసారిగా సహనం కోల్పోయి.. అలీని ఎగరి ముఖంపై తన్నేసింది. ఈ అనూహ్య ఘటనతో కంటెస్టెంట్లు, షో చూసిన బిగ్‌బాస్ ప్రియులు కంగుతిన్నారు.

మరోసారి వివాదం..!

ఆ తర్వాత మళ్లీ.. ‘నీకు డబ్బులు కావాల్సితే ఇస్తా కాని.. నువ్ టచ్ చేయకు’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది హిమజ. ఆమె మాటలతో అలీ కోపంతో ఊగిపోయాడు. ‘నువ్ నా ముఖం మీద తన్నుతావా? నిన్నూ లాగిపెట్టి కొడతా..’ అంటూ హిమజపైకి మరోసారి అలీ దూసుకెళ్లాడు. ‘నువ్ చేతులు పెట్టావ్ కాబట్టే నిన్ను తన్నా తప్పితే వ్యక్తిగతంగా చేయలని కాదు’ అని ఆమె సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే అలీ ‘నువ్ వాటర్ తాగి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే నేను డబ్బులు తీసుకోవడానికి ట్రై చేశా.. అంత మాత్రాన తన్నుతావా’ అని గట్టిగా అరవడంతో పాటు ఆమెపై వ్యక్తిగత దూషణకు దిగాడు.

కాళ్లపై పడినప్పటికీ..!

ఆమె పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడటంతో హిమజ హర్ట్ అయ్యింది.. ‘నేను తన్నాలని తన్నలేదు అయినా తప్పు జరిగింది కాబట్టి క్షమించమంటున్నా.. ఇంతకు మించి ఇంకేం చేయాలి’ అంటూ అతని కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ అలీ తగ్గకపోగా.. ‘నువ్ కాళ్లపై పడి సింపథీ చూపించడం కాదు.. నేను నిన్ను కాళ్లపై పడమన్నానా?’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో హిమజ.. బాత్రూమ్‌కి వెళ్లి మరీ బోరున ఏడ్చింది. అయితే సరిగ్గా ఇదే టైమ్‌లో తమన్నా రంగంలోకి దిగింది.. ‘హిమజ సారి చెప్తూ కాళ్లపై పడినా.. నువ్ ఏంటి రెచ్చిపోతున్నావ్’ అంటూ అలీపై ఎటాక్ చేసింది. అయితే మరోసారి సహనం కోల్పోయిన అలీ.. హిమజను అటుంచి తమన్నాపైకి గొడవకు వెళ్లాడు. ఆ తర్వాత నా పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడి జనంలోకి ఏదో అయ్యిందనే మెసేజ్ వెళ్లేలా చేస్తున్నావ్.. ఏం జరిగిందో చెప్పు అంటూ అలీని నిలదీసింది. అయితే కాసేపటి అలీ వచ్చి హిమజతో కూల్‌గా మాట్లాడటంతో పరిస్ధితి సద్దుమణిగింది. ఈ ఇద్దరి పంచాయితీ ఇంతటితో ముగియగా ఆ తర్వాత శ్రీముఖి-వరుణ్‌ గొడవ పడింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.