మహేష్ మూవీ ఓవర్ సీస్ రైట్స్ కి భారీ రేటు..!
Saturday, August 20, 2016 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్లతో నిర్మిస్తున్నారు. అయితే....ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ కోసం నిర్మాతలు భారీ రేటు ఆశిస్తున్నారని సమాచారం. తెలుగు, తమిళ్ రెండింటికి కలిపి ఓవర్ సీస్ రైట్స్ ను 25కోట్లకు అమ్మాలనుకుంటున్నారట.
మహేష్ కి ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంది. మహేష్ సినిమాలు ఈజీగా మిలియన్ మార్క్ ను అందుకుంటాయి. మహేష్ ఇమేజ్, ఈ సినిమా భారీ బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని 25 కోట్లు చెబుతున్నారట. ఎట్టి పరిస్ధితుల్లో 25 కోట్లకు తక్కువగా ఓవర్ సీస్ రైట్స్ ఇవ్వం అంటున్నారట చిత్ర నిర్మాతలు. మరి.. 25 కోట్లకు మహేష్ మూవీ ఓవర్ సీస్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.