close
Choose your channels

త్రిష నాయ‌కి ని మెచ్చుకున్న ఇలియానా

Saturday, July 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాయ‌కి చిత్రం లుక్ తో పాటు ట్రైల‌ర్స్ పాట‌లు బాగున్నాయి అంటూ మ‌రో ప్ర‌ముఖ క‌థానాయిక ఇలియానా మెచ్చుకున్నారు. త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారిణిగా గోవి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం నాయ‌కి. రాజ్ కందుకూరి స‌మ‌ర్ప‌ణ‌లో గిరిధ‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ బ్యానర్ పై గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, ప‌ద్మ‌జ మామిడిప‌ల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా ఇలియానా స్పందిస్తూ...ఈ చిత్రం ట్రైల‌ర్స్, సాంగ్స్ ఇటీవ‌ల చూసాను. చాలా ఆస‌క్తిక‌రంగా.. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనిపించేలా ఉన్నాయి. త్రిష చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌ర‌చ‌డంతో పాటు చాలా గ్లామ‌రస్ గా ఉంది. త్రిష కెరీర్ లోనే నాయ‌కి మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించిన చిత్రం అవుతుంద‌ని ఆశిస్తున్నాను. సాధార‌ణంగా నాకు హ‌ర్ర‌ర్ సినిమాలంటే భ‌యం. మా మేనేజ‌ర్ గిరిధ‌ర్ ఈ చిత్రం చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలిపారు.

ఈ చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ...హ‌ర్ర‌ర్ చిత్రాల్లో కొత్త ర‌క‌మైన చిత్ర‌మిది. ఇందులో త్రిష న‌ట‌న ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌గా, త్రిష పాత్ర‌కు విభిన్న కోణాలుంటాయ‌ని ద‌ర్శ‌కుడు గోవీ తెలిపారు.

గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్, బ్ర‌హ్మానందం, జీవీ, స‌త్యం రాజేష్, జ‌య‌ప్ర‌కాష్, సుష్మ‌రాజ్, కోవై స‌ర‌ళ‌, మ‌నోబాల త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఛాయ‌గ్ర‌హ‌ణం - జ‌గ‌దీష్ చీక‌టి, సంగీతం - ర‌ఘ కుంచె, పాట‌లు - భాస్క‌ర‌భ‌ట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - రాంబాబు కుంప‌ట్ల‌, క‌ళ - కె.వి.ర‌మ‌ణ‌, కూర్పు - గౌతంరాజు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.