close
Choose your channels

చందు మొండేటి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

Friday, November 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కార్తికేయ‌, ప్రేమ‌మ్ చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి. త‌దుప‌రి చిత్రాన్ని చందు ఏ హీరోతో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే...చందు నెక్ట్స్ మూవీ హీరో అంటూ వ‌రుణ్ తేజ్, ర‌వితేజ‌, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి. కానీ...ఇవేవి క‌న్ ఫ‌ర్మ్ కాలేదు.

అయితే...ఎప్ప‌టి నుంచో చందు త‌న అభిమాన హీరో నాగార్జున‌తో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నారు. నాగ్ కోసం పోలీస్ స్టోరీ ఎప్పుడో రెడీ చేసాడు. ఇప్పుడు ఈ మూవీనే చందు నెక్ట్స్ మూవీ అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌రుణ్ తేజ్ తో సినిమా చేయాలి అనుకున్నా...కాలుకు గాయ‌మై విశ్రాంతి తీసుకుంటున్నాడు. అది కాకుండా మిస్ట‌ర్, ఫిదా ఈ రెండు చిత్రాల‌ను పూర్తి చేయాలంటే కాస్త టైమ్ ప‌డుతుంది. అందుచేత చందు నాగ్ తో మూవీ చేయ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల పై క్లారిటి రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.