close
Choose your channels

'జాగ్వార్' ఆడియో రిలీజ్ డేట్....

Friday, August 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార్ హీరోగా చ‌న్నాంబిక ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎ.మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వంలో అనితా కుమార‌స్వామి నిర్మిస్తున్న చిత్రం `జాగ్వార్‌` దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో థ‌మ‌న్‌, మ‌నోజ్ ప‌ర‌మ‌హంస, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వంటి టాప్ టెక్నిషియ‌న్స్ ప‌నిచేస్తున్నారు.

రీసెంట్‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే నెల అంటే సెప్టెంబ‌ర్ 18న హైద‌రాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో సినిమా ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక‌కు రావాల్సిందిగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా ఆహ్వానం అందింది. ప‌వ‌న్ తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వేడుకకు హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.