close
Choose your channels

నిర్మాణ రంగంలోకి జాలీ హిట్స్‌

Friday, September 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

25కి పైగా భార‌తీయ‌ సినిమాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా పంపిణీ చేయ‌డ‌మే కాకుండా దాదాపు వంద సినిమాల‌ను యుఎస్ఎలో ప్ర‌ద‌ర్శించిన సంస్థ‌ జాలీహిట్స్. ఓవ‌ర్సీస్ మూవీ డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్గిబిష‌న్‌పైనే ఫోక‌స్ పెట్టిన ఈ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్‌ అండ్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ.. తొలుత యుఎస్ఎ, కెన‌డాలో ప్రారంభ‌మైంది. 2009లో ఈ సంస్థ‌ని ప్రారంభించారు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అజ‌య్ రెడ్డి గొల్ల‌ప‌ల్లి. మిచిగ‌న్‌, యుఎస్ ఎలో ప్ర‌ధాన కేంద్రాలు క‌లిగి ఉన్న జాలీ హిట్స్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా స‌ర్వ్ అయింది.

అంతేకాకుండా.. ప్ర‌స్తుతం భార‌తీయ సినిమాల‌ను ఓవ‌ర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూష‌న్ చేస్తున్న లీడింగ్ కంపెనీల్లో ఒక‌టిగా పేరు తెచ్చుకుందీ సంస్థ‌. భార‌తీయ భాషా చిత్రాల‌ను థియేట‌రిక‌ల్‌, టెలివిజ‌న్ సిండికేష‌న్‌, డిజిటిల్ ప్లాట్ ఫామ్స్‌.. ఇలా ప‌లు ఫార్మెట్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా పంపిణీ చేసిందీ సంస్థ‌. 50కి పైగా దేశాల‌లో డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉన్న ఈ సంస్థ‌కి భార‌త్‌, యుకె, యునిటైడ్ స్టేట్స్‌, యూర‌ప్‌, ఆస్ట్రేలియా, సింగ‌పూర్‌, కెన‌డా దేశాల‌లో కార్యాల‌యాలు ఉన్నాయి. అలాగే 150కి పైగా సినిమాలు జాలీహిట్స్ లైబ్ర‌రీలో ఉన్నాయి.

రామ్‌చ‌ర‌ణ్ కి ఓవ‌ర్‌సీస్‌లో తొలి మిలియ‌న్ డాల‌ర్ మూవీ అయిన ధృవ‌ని ఈ సంస్థే పంపిణీ చేసింది. అలాగే క‌న్న‌డ‌లో టాప్ 5 గ్రాస‌ర్స్ అయిన సినిమాల‌ని కూడా ఈ సంస్థే పంపిణీ చేసింది. బాహుబ‌లి సిరీస్‌, మిర్చి, ఫిదా, శ‌త‌మానం భ‌వతి, సింగం 2(త‌మిళ్‌) వంటి చిత్రాల‌ను ప్రద‌ర్శించిన జాలీ హిట్స్‌.. యుట‌ర్న్‌, కిరిక్ పార్టీ, రాజ‌కుమార, రంగిత‌రంగ‌ వంటి విజ‌య‌వంత‌మైన‌ క‌న్న‌డ చిత్రాల‌తో పాటు ధృవ‌, మ‌జ్ను వంటి హిట్ చిత్రాల‌ను పంపిణీ చేసింది. రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లంని కూడా ఈ సంస్థే పంపిణీ చేయ‌నుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ సంస్థ ద‌క్షిణాదిలోని నాలుగు భాష‌ల్లో (తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం) ఏక‌కాలంలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కిస్తోంది.

రాజ‌ర‌థం/ రాజ‌ర‌థ పేరుతో ఈ చిత్రాన్ని జాలీ హిట్స్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై అంజు వ‌ల్ల‌భ‌నేని, విషు ద‌క‌ప్ప‌గిరి, స‌తీష్ శాస్త్రితో క‌లిసి అజ‌య్ రెడ్డి గొల్ల‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. రంగిత‌రంగ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌న్న‌డ చిత్రాన్ని రూపొందించిన అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో ఆ చిత్ర క‌థానాయ‌కుడు నిరూప్ భండారి హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పంపిణీ, ప్ర‌ద‌ర్శ‌న రంగంలో స‌క్సెస్ అయిన ఈ సంస్థ.. నిర్మాణ రంగంలోకి దిగుతూ మొద‌టిసారిగా చేస్తున్న ప్ర‌య‌త్నం కూడా విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు అజ‌య్ రెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.