close
Choose your channels

వెబ్ సిరీస్‌లో మెర‌వ‌నున్న చంద‌మామ‌

Tuesday, July 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెబ్ సిరీస్‌లో మెర‌వ‌నున్న చంద‌మామ‌

తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీ ఉంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌మిళంలో `కోమాలి`, తెలుగులో `ర‌ణ‌రంగం` చిత్రాల్లో న‌టించింది. కాగా ఈ రెండు సినిమాలు ఆగ‌స్ట్ 15నే విడుద‌ల కానుండ‌టం గ‌మ‌నార్హం. కాగా.. సినిమాల‌కు భిన్న‌మైన డిజిట‌ల్ మాధ్య‌మంలోకి ఈ అమ్మ‌డు ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని టాక్‌. బాలీవుడ్, ద‌క్షిణాది టాప్ స్టార్స్ ఇప్పుడు వెబ్ సిరీస్‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. కాజ‌ల్ కూడా ఇప్పుడు వారి బాట‌లోకి అడుగు పెట్ట‌నుంది. వివ‌రాల్లోకెళ్తే.. ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు హాట్ స్టార్‌తో క‌లిసి ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నారు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌ట‌. ఆగ‌స్ట్‌లో ప్రారంభ‌మ‌య్యే ఈ వెబ్ సిరీస్‌ను సెప్టెంబ‌ర్‌లో ముగించ‌నున్నారు. 10 భాగాలుగా ఈ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేశార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.