close
Choose your channels

భారీ రేటుకు ఖైదీ నెం 150 శాటిలైట్ రైట్స్..!

Monday, December 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. చాలా గ్యాప్ త‌రువాత చిరు న‌టిస్తుండ‌డంతో సినిమా ప్రారంభం నుండి ఖైదీ నెం 150 పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు.

ఖైదీ నెం 150 టీజ‌ర్ & ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుండ‌డం, అలాగే అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు, సుంద‌రి సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను ఊహించ‌ని విధంగా 13 కోట్ల‌కు ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. అయితే....ఏ ఛాన‌ల్ ఖైదీ నెం 150 రైట్స్ ద‌క్కించుకుంది అనేది తెలియాల్సి ఉంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఖైదీ నెం 150 సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.