close
Choose your channels

చంద్రబాబుపై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

Friday, January 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబుపై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన నాని.. 2014 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌ను కూడా సీఎం కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీని ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌ అని.. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వచ్చిన ప్రజాదరణ చూసిన టీడీపీ నేతలు మతి తప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వైఎస్ చనిపోయినా..!!
రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి మరొకరు లేరని నాని విమర్శలు గుప్పించారు. 2004 కంటే ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ ఒక్క వర్గానికి మేలు చేయకపోవడంతో.. ఆయన మాటలు నమ్మని ప్రజలు మహానేతను ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు. వైఎస్ సీఎం అయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అందుకే వైఎస్ చనిపోయినా ఆయన అమలు చేసిన పథకాలు పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశాయని నాని చెప్పుకొచ్చారు. వైఎస్ మరణించిన తరువాత ఆ కుటుంబంపై కాంగ్రెస్‌ పార్టీ కక్షగట్టిందన్నారు.

మళ్లీ అలాంటి కుట్రలు..!
"కాంగ్రెస్‌కు టీడీపీ జత కట్టి అక్రమ కేసులు పెట్టించి వైఎస్‌ జగన్‌ను జైలుకు పంపించినా ధృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాను ఎదురించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఆయన్ను దించడం సాధ్యం కాదని చంద్రబాబు మళ్లీ కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి లేడని స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. చంద్రబాబు ఎప్పుడు దిగిపోతారా..? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు పెద్ద సైకో" అని బాబుపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.