close
Choose your channels

వాయిదా ప‌డ‌నున్న క్రిష్ 'మణికర్ణిక'

Wednesday, February 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తప్పుడు సమాచారంతో చేపట్టే ఆందోళనలతో సినీ పరిశ్రమ ఎంతో నష్టపోతోంది. నిన్నటివరకు ఈ ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అయింది 'పద్మావత్' సినిమా. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ ప్రధాన పాత్రధారిణిగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం 'మణికర్ణిక'కు కూడా ఆందోళనల సెగ తగులుకుంది. రాజస్థాన్‌లో చిత్రీకరణ జరుపుకోవలసి ఉన్న ఈ చిత్రానికి.. ఈ ఆందోళనల కార్యక్రమాల వలన చిత్రీకరణలో కొంత జాప్యం కలుగుతోంది.

వైవిధ్యకథలను తెరకెక్కించే తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది ఆయ‌న తెలుగు వారి మొదటి శాతవాహన చక్రవర్తి జీవిత‌గాధ‌ని 'గౌతమిపుత్ర శాతకర్ణి'గా తెరకెక్కించారు. ఇప్పుడు సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టిన ఝాన్సీ లక్ష్మీభాయ్‌ కథను రూపొందిస్తున్నారు క్రిష్.

అయితే ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తూ ఝాన్సీ పాత్రను తీర్చిదిద్దుతున్నార‌ని... ఇటీవ‌ల కొన్ని బ్రాహ్మణ సంఘాలు రాజస్థాన్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నిర్మాత వివరణ ఇవ్వడంతో వారు శాంతించారు. దీంతో.. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఇప్పటికే వి.ఎఫ్.ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో .. ఏప్రిల్ 27కి విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేసే అవకాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.