close
Choose your channels

‘రాధేశ్యామ్’ అప్‌డేట్స్ ఇచ్చిన కృష్ణంరాజు

Thursday, January 21, 2021 • తెలుగు Comments

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యు.వి.కృష్ణంరాజు సమర్పకుడిగా ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నా చిత‌కా అప్‌డేట్స్ మిన‌హా ఈ సినిమాకు సంబంధించి మేజ‌ర్ అప్‌డేట్ లేద‌ని అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలవుతుందని అభిమానులు ఆతృత‌గా ఎదురుచూసినా, ఫ‌లితం లేకుండా పోయింది. చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి ఏమీ చెప్ప‌క‌పోయినా సీనియ‌ర్ స్టార్ కృష్ణంరాజు సినిమాకు సంబంధించి కొన్ని కీల‌క‌మైన అప్‌డేట్స్‌ను రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఇచ్చాడు.

రాధేశ్యామ్ ఏప్రిల్‌లో విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పిన కృష్ణంరాజు తాను కూడా ‘రాధేశ్యామ్‌’లో ఓ చిన్న పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. త‌న‌కు, ప్ర‌భాస్‌కు మ‌ధ్య స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంద‌ని, పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింద‌ని...పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు కృష్ణంరాజు. మ‌రో వైపు ప్ర‌భాస్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది.

Get Breaking News Alerts From IndiaGlitz