close
Choose your channels

ట్రోలర్స్‌పై మండిపడిన మంచు లక్ష్మి..

Thursday, October 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ట్రోలర్స్‌పై మండిపడిన మంచు లక్ష్మి..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో... మరో వైపు సుశాంత్ మరణానికి రియానే కారణమంటూ విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి రియాకు మద్దతుగా నిలిచింది. నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని దోషిగా చూపకూడదని మంచు లక్ష్మి హితవు పలికింది. సుశాంత్ విషయంలో నిజం బయటకు వస్తుంది అని నమ్ముతున్నాను అంటూ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ట్రోలర్స్‌కు మరోసారి పని చెప్పాయి.

రియాకు న్యాయం జరగాలని కోరుతున్న మంచు లక్ష్మికి సుశాంత్ ఎందుకు కనిపించలేదు? ఆయనకు న్యాయం జరగాలని ఎందుకు కోరడం లేదంటూ ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మి రియాకు మద్దతు తెలపడంపై కొత్త కోణాన్ని సైతం ట్రోలర్స్ వెతికి పట్టుకున్నారు. రకుల్, రియాలు మంచి స్నేహితులవడంతో పాటు డ్రగ్స్ వ్యవహారంలో ఇద్దరికీ సంబంధం ఉందని.. లక్ష్మికి కూడా రకుల్ మంచి స్నేహితురాలు కాబ్టటి ఆమెకు కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందేమోనంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సాటి మహిళగా రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా? అని ఆమె ప్రశ్నించింది.

తమ నోళ్లను కట్టేస్తున్నారని.. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీల నుంచి సమాచారాన్ని లీక్‌ చేస్తున్నదెవరని నిలదీసింది. తమకు పెట్టే ఆంక్షలు మీడియాకు వర్తించవా? అంటూ మండిపడింది. రియాకు మద్దతుగా ట్వీట్ చేసినప్పుడు తనకు వేలాది కాల్స్ వచ్చాయని.. తనను కూడా బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌లో ఇరికించే ప్రయత్నం చేశారని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తనపై సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు చూసి తన తల్లి టెన్షన్‌ పడుతోందని.. రియాకు మద్దతు తెలపడం తనకో గుణపాఠం నేర్పిందని తెలిపింది. ఇకపై అభిప్రాయాలను ఓపెన్‌గా వెల్లడించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది. కోవిడ్‌లో మనమే నంబర్‌ వన్‌ అని.. మన ఎకానమీ కొలాప్స్ అయ్యిందని.. వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? అని మంచు లక్ష్మి వ్యవస్థను నిలదీసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.