close
Choose your channels

రజనీకాంత్ - జాకీచాన్ కాంబినేషన్ లో మూవీ..

Tuesday, June 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌జ‌నీకాంత్ అంటే స్టైల్...జాకీచాన్ అంటే యాక్ష‌న్...అందుక‌నే స్టైల్ లో కింగ్ ర‌జ‌నీ..యాక్ష‌న్ లో కింగ్ జాకీచాన్ అంటుంటారు. ఈ కింగ్స్ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే...సంచ‌ల‌న‌మే. ర‌జ‌నీకాంత్ - జాకీచాన్ కాంబినేష‌న్లో మూవీ రూపొందించి సంచ‌ల‌నం సృష్టించేందుకు క‌బాలి మ‌లేషియ‌న్ ప్రొడ్యూస‌ర్ మొహ‌ద్ ర‌ఫీజీ మొహ‌ద్ జిన్ ప్ర‌య‌త్నిస్తున్నారు.ఈ విష‌యాన్ని నిర్మాత మొహ‌ద్ ర‌ఫీజీ మొహ‌ద్ జిన్ మ‌లేషియ‌న్ మీడియాకి తెలియ‌చేసార‌ట‌. ర‌జ‌నీకాంత్, జాకీచాన్, సోన‌మ్ క‌పూర్ కాంబినేష‌న్ లో ఓ ఫాంట‌సీ మూవీ రూపొందించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చిన్నిస‌గ అనే టైటిల్ అనుకుంటున్నారు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే... ఈ ప్రాజెక్ట్ ఇండియ‌న్ స్ర్కీన్ పైనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌నివినీ ఎరుగ‌ని రీతిలో మ్యాజిక్ చేయ‌డం ఖాయం. ర‌జ‌నీకాంత్ అమెరికా నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.