close
Choose your channels

'నా పేరు సూర్య' చిత్రంలోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

Friday, April 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

undefinedస్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు

ఆ మధ్య రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్... ఈ మధ్యే రిలీజ్ చేసిన లవర్ ఆల్సో ఫైటర్ అల్సొ సాంగ్ ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక ఇప్పుడు బ్యూటిఫుల్ లవ్ అంటూ సాగే పాటను నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష శ్రీధర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ... నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా లోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని రిలీజ్ చేశాం. ఇది నా ఫేవరేట్ సాంగ్. నాకు బాగా నచ్చింది. మంచి మెలోడీ. విశాల్ శేఖర్ అన్ని పాటలు చాలా బాగా ఇచ్చారు. స్పెషల్ గా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. సింగర్స్ ఆర్మాని మాలిక్, చైత్ర, అంబడి పూడి. అద్భుతంగా పాడారు. సీతారామ శాస్త్రి గారు మంచి సాహిత్యం అందించారు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు. యాక్షన్ పార్ట్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.