close
Choose your channels

'నా మాటే విన‌వా' పోస్ట‌ర్ లాంచ్‌

Saturday, November 16, 2019 • తెలుగు Comments

నా మాటే విన‌వా పోస్ట‌ర్ లాంచ్‌

శ్రీ‌శివాని ఆర్ట్స్& పి.ఎస్‌.మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై లింగ‌స్వామి వేముగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌శంక‌ర్‌గౌడ్ నిర్మిస్తున్నచిత్రం నా మాటే విన‌వా. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌత‌మ్‌రాజు త‌న‌యుడు కృష్ణ, కిర‌ణ్‌చ‌త్వాని జంట‌గా న‌టిస్తున్నారు. సాయికుమార్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, కోటేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఛైర్మ‌న్ మోహ‌న్ వ‌డ్ల‌పాటి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఫిల్మి ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ చైర్మ‌న్ వ‌డ్ల‌పాటి మాట్లాడుతూ... న‌న్ను అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూస‌ర్స్ త‌ర‌పున ప్ర‌తి చిన్న సినిమాకి మా త‌ర‌పు స‌హాయ స‌హ‌కారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాకి కూడా మా స‌హ‌కారాలు త‌ప్ప‌కుండా అందిస్తాము. ఈ మూవీ యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

డైరెక్ట‌ర్ లింగ‌స్వామి మాట్లాడుతూ... నాది తొమ్మిద‌వ సినిమా నేనుగ‌తంలో కూడా అన్నీ మంచి చిత్రాలు చేశాను. 6 నంది అవార్డుల‌ను కూడా అందుకున్నాను. ప్రొడ్యూస‌ర్ నాకు మంచి మిత్రుడు. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇది. హీరో కృష్ణ యూత్ ఎన‌ర్జిటిక్ హీరో. కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్‌లో మంచి ఫైట‌ర్ అన్న పేరు వ‌చ్చింది. ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మ‌ర్ అని పేరు వ‌స్తుంది. ప్రొడ్యూస‌ర్స్ ఖ‌ర్చుకి ఎక్క‌డా వెన‌కాడ‌లేదు. రెండు పాట‌లు మ‌లేషియాలో తీశాం. కోటేశ్వ‌ర్‌రావు, తిరుప‌తి దొరై ఈ చిత్రంలో మంచి పాత్ర‌లు పోషించారు. ఐదు పాట‌లు ఏలేంద్ర‌గారు అందించారు. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ మ‌నోహ‌ర్‌గారు చాలా రిచ్‌గా తీశారు. స‌హ‌క‌రించిన జ‌గ‌దీశ్వ‌రావుగారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా సెన్సార్‌కి అప్లై చేశాం సెన్సార్ అవ్వ‌గానే విడుద‌ల తేదీని ఖ‌రారు చేస్తాము. బీటెక్ స్టూడెంట్స్ నిశ్చితార్ధం త‌రువాత ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణించే క‌థాంశంతో చివ‌రికి మంచి ఫ్రెండ్స్ అయి పెళ్లి వ‌ర‌కు ఎలా వ‌చ్చారు అనేది చిత్ర క‌థ‌. క్లైమాక్స్‌లో సాయికుమార్ గారి పాత్ర చాలా కీల‌కం. మా ఎంటైర్ యూనిట్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ... ఫ‌స్ట్ కాపీ చూశాక చాలా ఆనందంగా ఫీల‌య్యాం. ఈ విష‌యం ప్రెస్‌తో పంచుకోవ‌డానికి ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశాం. ఈ సినిమాలో పాట‌లు చాలా బాగా కుదిరాయి ఏలేంద్ర‌గారు చాలా థ్యాంక్స్ అన్నారు. వ‌రంగ‌ల్ మీద తీసిన మాస్ సాంగ్ చాలా బావుంది. థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ . రెండు పాట‌లు అర‌కులో, రెండు మ‌లేషియాలో చిత్రీక‌రించాం. న‌న్ను యాక్ష‌న్ నుంచి ల‌వ‌ర్ బాయ్‌గా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ యేలేంద్ర మ‌హావీర మాట్లాడుతూ... మా ప్రొడ్యూస‌ర్లు న‌న్ను చాలా బాగా చూసుకున్నారు. బ్యాక్‌గ్రైండ్ స్కోర్ గురించి సాయికుమార్‌గారు కూడా న‌న్ను బాగా అప్రిషియేట్ చేశారు. హీరో కూడా చాలా బాగా చేశారు. ఈ చిత్రంలో ఐదు పాట‌లున్నాయి. ప్ర‌తి పాట ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌రుండి సిట్యువేష‌న్‌కి త‌గ్గ‌ట్లు రాయించుకున్నారు.

ప్రొడ్యూస‌ర్ శంక‌ర్‌గౌడ్ మాట్లాడుతూవ‌... నాకు ఈ క‌థ న‌చ్చి సినిమా చేశాను. ఇది ల‌వ్ క‌మ్ ఫ్యామిలీ స్టోరీ మీరంద‌రూ తప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, తిరుప‌తిదొరై, లిరిసిస్ట్ ఘ‌న‌యాది త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌వికిర‌ణ్‌, శ్రీ‌నివాస్‌చౌద‌రి, అనంత్‌, శ్రీ‌రామ్‌, తిరుప‌తి సిద్దిపేట‌, వ‌రంగ‌ల్‌భాషా, వి. జ‌గ‌దీశ్వ‌ర‌రావు, హేమ‌, వీణాసుంద‌ర్‌, జ‌య‌వాణి, జ‌బ‌ర్ద‌స్థ్ రాఘ‌వ‌, జ‌బ‌ర్ద‌స్త్ వెంకీ, జ‌బ‌ర్ద‌స్థ్ చిరంజీవులు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః యేలేంద‌ర్ మ‌హావీర్‌, డిఓపి మ‌నోహ‌ర్‌, ఎడిటింగ్ః సంజీవ‌రెడ్డి, పాట‌లుఃఘ‌న‌యాది, ఫైట్స్ఃథ్రిల్ల‌ర్ మంజు, ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్ఃదూలం ర‌మేష్‌, నిర్మాణ సార‌ధ్యంః ప‌ల్లెశంక‌ర్‌గౌడ‌ర్‌, స‌హ‌నిర్మాతఃపి. వీరేంద‌ర్‌రెడ్డి, నిర్మాత‌లుఃపి. విన‌య్‌కుమార్‌, శ్రీ‌నివాస్‌. ద‌ర్శ‌క‌త్వంఃలింగుస్వామి వేముగంటి

Get Breaking News Alerts From IndiaGlitz