close
Choose your channels

కూర్గులో కల్యాణ్ వైభోగమే

Saturday, September 26, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగశౌర్య నటిస్తున్న సినిమా కల్యాణ వైభోగమే. దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది. అలా మొదలైంది ఫేమ్ నందిని రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కూర్గులో జరుగుతోంది. ఆఖరి పాటను కూర్గులో చిత్రీకరిస్తున్నారు.

ఈ విషయాన్ని నాగశౌర్య షేర్ చేసుకున్నారు. ఆఖరి పాట కూర్గులో జరుగుతోంది అని ఆయన సోషల్ మీడియాలో మెసేజ్ చేశారు. ఈ సినిమాకు కల్యాణ్ కోడూరి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ మాళవికా నాయర్ ఈ సినిమాలో నాయికగా నటిస్తోంది. క్యూట్ లవ్ స్టోరీ కమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోందీ సినిమా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.