ఓం నమో వేంకటేశాయ నాగ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
Sunday, August 21, 2016 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నవరస సమ్రాట్ - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హధీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల నాగార్జున ప్రీ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక నాగార్జున పాత్రకు సంబంధించిన లుక్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.
అక్కినేని నాగార్జు శ్రీవారి విశిష్ట భక్తుడుగా విభిన్న పాత్రలో...అంటూ రిలీజ్ చేసిన నాగ్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటుంది. నాగ్ లుక్ సినిమా పై అంచనాలను మరింత పెంచేస్తూ...అధ్యాత్మిక అద్భుత చిత్రంగా నిలవడం ఖాయం అనిపిస్తుంది. ఈ భక్తిరస చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.