close
Choose your channels

తమిళ మార్కెట్ పెంచుకోడానికి ఇదే రైట్ టైమ్ - నాగార్జున (ఇంటర్వ్యూ)

Saturday, August 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున. 30ఏళ్ల కెరీర్‌లో ఆయన డిఫరెంట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అన్నీవర్గాలప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలను చేస్తున్నారు. కొత్త దర్శకులు, నటీనటులు, టెక్నిషియన్స్ ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటారు. ఈరోజు(ఆగస్ట్29న) నాగార్జున పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ....

'సొగ్గాడే చిన్ని నాయనా'లో చేస్తున్న క్యారెక్టర్స్...

ఫస్ట్‌ టైమ్‌ 'సొగ్గాడే చిన్నినాయనా' ఫుల్‌ కామెడి మూవీ. డబుల్‌ రోల్‌ చేస్తున్నాను. ఫస్ట్‌ టైమ్‌ నేను తండ్రి కొడుకులుగా నటిస్తున్నాను. ఒక క్యారెక్టర్‌ సొగ్గాడు అయితే మరో క్యారెక్టర్‌ అమాయకంగా ఉంటుంది. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు విదేశాల్లో పెరుగుతాడు. ఇండియా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేదే కథ. కొంచెం అమాయకమైన, సాఫ్ట్‌ నేచర్‌ ఉన్న క్యారెక్టర్‌. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో అవుటండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. ఫాదర్‌ క్యారెక్టర్‌ ఇందులో గోస్ట్‌ క్యారెక్టర్‌. చనిపోయి కొడుక్కి మాత్రమే కనపడుతుంటాడు. ఈ పాయింట్‌ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌ అనిపించింది. సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. హిలేరియస్‌ కామెడితో సినిమా ఉంటుంది. రెండు క్యారెక్టర్స్‌ ను బేస్‌ చేసుకుని 'సొగ్గాడే చిన్ని నాయనా' అనే టైటిల్‌ పెట్టాం.

అఖిల్‌ సినిమా రషెష్ చూశారా, ఎలా అనిపించింది...

చాలా హ్యపీగా అనిపించింది. స్పెయిన్‌లో షూటింగ్‌ స్పాట్‌కి కూడా వెళ్లాను. చాలా కాన్ఫిడెంట్‌గా చేస్తున్నాడు.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ గురించి...

కళ్యాణ్‌ కృష్ణ మంచి రచయిత, కథ చెప్పినప్పుడు ఆ పాయింట్‌ నాకు బాగా నచ్చింది. అయితే అతనికి స్క్రీన్‌ ప్లేలో సపోర్ట్‌ అవసరమైనప్పుడు నా సైడ్‌ నుండి వీలైనంత సపోర్ట్‌ చేశాను. ఓరిజినల్‌ స్టోరీ లైన్‌ ను ఉయ్యాలా జంపాలా` ఫేమ్‌ రామ్మోహన్‌ ఇచ్చారు. కళ్యాణ్‌ ఆ పాయింట్‌ ను బాగా డెవలప్‌ చేశాడు.

తమిళంలో కూడా మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం..

నేను, కార్తీ చేస్తోన్న సినిమా రిలీజ్‌ ఎప్పుడు ఉంటుందో కరెక్ట్‌ గా చెప్పలేను. ఇది డబ్బింగ్‌ వెర్షన్స్‌ తరహాలో కాకుండా ప్రతి షాట్‌ తెలుగుతో పాటు తమిళంలో రూపొందుతోంది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్‌ చేసేలా మంచి రిలీజ్‌ డేట్‌ కోసం ప్రొడ్యూసర్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. అన్నీ కుదరగానే రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాం. ఇన్‌ టచ్‌ బుల్స్‌` మూవీని నేను చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో అవకాశం వస్తే నేను నటించాలనుకున్నాను. అయితే మూడు సంవత్సరాల తర్వాత ఆ పాయింట్‌ ను తీసుకుని వంశీ పైడిపల్లి ఛేంజస్‌ చేసి తీసుకొచ్చాడు. నచ్చిన పాయింట్‌ కావడంతో చేయడానికి యాక్సెప్ట్‌ చేశాను. ఇప్పుడు నా కొడుకులిద్దరూ నటిస్తున్నారు. అలాంటప్పుడు కొత్త జోనర్స్‌ మూవీస్‌, కొత్త పాయింట్‌ ఉన్న సినిమాలు చేయాలనేది ఆశ. అలాంటి సమయంలో పివిపి సినిమా వచ్చింది.

రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో

రాఘవేంద్రరావుగారు కథ చెప్పారు. పాయింట్‌ బావుంది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలోనే బయటికి వస్తాయి.

మీరు చైతు, అఖిల్‌ కలసి నటించే సినిమా..

నేను, చైతు, అఖిల్‌ కలసి మూవీ చేయడం అనేది చాలా ఎర్లీ క్వశ్చన్‌. దానికి ఇంకా సమయముంది.

అలా ఉండటాన్ని ఇష్టపడతాను...

అవునండీ..చైతు ఎక్స్‌ పెరిమెంట్స్‌ చేస్తూ కొత్త సినిమాలు చేయాలనే తపనతో ముందుకెళ్తున్నాడు. అలా ఉండటానే నేను ఇష్టపడతాను.

సలహాలివ్వను...

అఖిల్‌ సినిమా విషయంలో ముందు కథ వినగానే నాకు బాగా నచ్చింది. ఇటీవల రషెష్‌ చూశాను. వినాయక్‌ డైరెక్షన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేనైతే ఏ ఇన్‌ పుట్స్‌ చెప్పలేదు. నన్ను సలహా అడిగితే చెబుతానే తప్ప ఇంటర్‌ ఫియర్‌ కాను. నాన్నగారు కూడా నా కెరీర్‌ లో ఎప్పుడూ ఇంటర్‌ ఫియర్‌ కాలేదు.

మూడో పార్ట్ త్వరలోనే ఉంటుంది...

'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూడో సెషన్‌ అక్టోబర్‌, నవంబర్‌ లో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. అయితే నేనింకా డేట్స్‌ ఫిక్స్‌ చేయలేదు. నిర్వాహకులు మాత్రం 60 ఏపిసోడ్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఫార్మెట్‌ చేంజ్‌ కావడం లేదు. టైమింగ్‌, రోజులనే మార్చే ఆలోచనలో ఉన్నారు.

నా కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు...

అఖిల్‌ సినిమా కోసం కథలు వెతుకుతున్నప్పుడు 'మనం' సినిమాలో అఖిల్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ చూసిన తర్వాత వినాయక్‌ వచ్చి అఖిల్‌ తో సినిమా చేస్తానన్నాడు. అలాగే నితిన్‌, సుదాకర్‌ రెడ్డిగారు వచ్చి అఖిల్‌ మూవీని ప్రొడ్యూస్‌ చేస్తామని అన్నారు. నితిన్‌, అఖిల్‌ ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. శ్రేష్ఠ్‌మూవీస్‌ వాళ్లు నా కంటే కేర్‌ తీసుకుని అఖిల్‌ను తమ సొంత బిడ్డలా చూసుకుంటూ సినిమా చేస్తున్నారు.

ప్రొడ్యూసర్ గా...

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా సినిమాని నిర్మిస్తున్నాను. కొత్త హీరోయిన్‌, కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌. అందరూ కొత్తవాళ్లనే పరిచయం చేస్తున్నాను. అందులో నేను చిన్న గెస్ట్‌ రోల్‌ లో కనపడతాను. ఇంకా ఏమైనా కొత్త పాయింట్స్‌ తో వస్తే సినిమాని నిర్మించడానికి రెడీగా ఉన్నాను.

ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తా...

రాజమౌళితో సినిమా చేయాలనుందని ఇది వరకు ఎప్పుడో చెప్పాను. ఆయనకి కుదరాలంతే. అయన ఇంకా బాహుబలి2ను కంప్లీట్‌ చేయాలి. ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతం చేయాలనుందని అంటున్నాడు. ఒకవేళ మహాభారతంలో చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.

తమిళమార్కెట్ పెంచుకోవడానికి ఇదే రైట్ టైమ్..

బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు తమిళంలో మంచి సక్సెస్‌ సాధించాయి. సినిమాలో పాయింట్‌ యూనిక్‌ గా ఉన్నప్పుడు తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి సబ్జెక్ట్స్‌ మనం కూడా సినిమాలు చేయాలి. తమిళంలో కూడా మన మార్కెట్‌ పెంచుకోవడానికి ఇదే రైట్‌ టైమ్‌ అనుకుంటున్నాను.

అఖిల్‌ బాలీవుడ్ లో...

తప్పకుండా నటిస్తాడు. నిజం చెప్పాలంటే అఖిల్‌కి తెలుగుకంటే ముందే బాలీవుడ్‌లో ఆఫర్స్‌ వచ్చాయి. అయితే ఇక్కడ శివను హిందీలో రీమేక్‌ చేసిన విధంగా జాగ్రత్తగా స్టెప్‌ తీసుకుని చేయాలి.

ప్రేక్షకులకు కావాల్సింది, మంచి సినిమాలే...

మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే చేయాలని ఆలోచనతో చేయడం లేదు. ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలనుకుంటాను. బాహుబలి సినిమాలో ఏ మెసేజ్‌ లేదు. అయినా ప్రేక్షకులు ఆదరించారు. మెసేజ్‌ ఓరియెంటెడ్‌ మూవీ శ్రీమంతుడుని కూడా ఆదరించారు. ప్రేక్షకులకు కావాల్సింది మంచి సినిమా. సినిమా బావుంటే ఏ సినిమా అయినా చూస్తారు. నేను కూడా మెసేజ్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేయాలని అనుకోవడం లేదు. పాయింట్‌ బావుండాలనుకుంటాను.

నెక్స్ ట్‌ ప్రాజెక్ట్స్‌..

సొగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని సాంగ్స్‌ సహా సెప్టెంబర్‌ 20కంతా పూర్తి చేసేస్తున్నాం. సెప్టెంబర్‌ చివరి నుండి పివిపి బ్యానర్‌ లో సినిమా ఉంటుంది. తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తాను. నెక్స్‌ ట్‌ ఇయర్‌ జేమ్స్‌ బాండ్‌ స్టయిల్‌ ఆఫ్‌ యాక్షన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నా. యాక్షన్‌ జోనర్‌ లో సినిమా చేసి చాలా రోజులైంది. నా ఏజ్‌ కి తగినట్టు స్లిక్‌ యాక్షన్‌ జోనర్‌ చేయాలనుకుంటున్నాను. మరో ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాను. కథలు రెడీ అవుతున్నాయి. రెడీకాగానే వివరాలు తెలియజేస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.