close
Choose your channels

చివ‌రి షెడ్యూల్‌లో 'య‌న్‌.టి.ఆర్‌'

Tuesday, November 27, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చివ‌రి షెడ్యూల్‌లో య‌న్‌.టి.ఆర్‌

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ రెండు భాగాల్లో 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. కాగా 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' చివ‌రి షెడ్యూల్ మాత్రం పెండింగ్‌లో ఉంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ఎన్నిక‌ల నిమిత్తం గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఈ చివ‌రి షెడ్యూల్ డిసెంబ‌ర్ 5 నుండి స్టార్ట్ అవుతుంది. డిసెంబ‌ర్ 25 వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ‌తో ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.