close
Choose your channels

ఎన్టీఆర్ 15 ఇయ‌ర్స్ 25 మూవీస్..

Wednesday, May 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం నిన్ను చూడాల‌ని. వి.ఆర్.ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా కిర‌ణ్ మూవీస్ నిర్మించిన నిన్ను చూడాల‌ని చిత్రం రిలీజై నేటికి స‌రిగ్గా 15 సంవ‌త్స‌రాలు అయ్యింది. అంటే...యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ ప్రారంభించి 15 ఇయ‌ర్స్ అయ్యింది. నిన్ను చూడాల‌ని చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1 చిత్రంలో న‌టించారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించారు.

వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆది చిత్రంతో ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని..హీరోగా ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ టైం లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోగా సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన చిత్రం సింహాద్రి. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టించింది. రాజ‌మౌళితో ఎన్టీఆర్ మూడ‌వ సారి చేసిన చిత్రం య‌మ‌దొంగ‌. ఈ చిత్రం కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. రాఖీ, అదుర్స్, బృందావ‌నం, బాద్ షా త‌దిత‌ర చిత్రాల‌తో ఎన్టీఆర్ మాస్ లో తిరుగ‌లేని క్రేజ్ సంపాదించుకున్నారు.

రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స చిత్రాల‌తో అంచ‌నాల‌ను అందుకోలేక పోయిన‌ ఎన్టీఆర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన టెంప‌ర్ తో స‌క్సెస్ సాధించారు. ఆత‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఈ మూవీ ఎన్టీఆర్ కి 25వ చిత్రం కావ‌డం విశేషం. ఈ చిత్రం 50 కోట్లు షేర్ సాధించి...ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్లు షేర్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో న‌టిస్తున్నారు. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 15 ఇయ‌ర్స్ లో 25 మూవీస్ చేసిన ఎన్టీఆర్...భ‌విష్య‌త్ లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు యంగ్ టైగ‌ర్..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.