close
Choose your channels

డిసెంబర్ 28న 'ఒక్క క్షణం' ?

Saturday, December 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఒక్క క్షణం`. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా` డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ రూపొందించిన ఈ సినిమా మంచి కథా కథనంతో ఆసక్తిగా ఉంటుందని వినికిడి.

చక్రి చిగురుపాటి నిర్మాత. అయితే ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నామని నిర్మాత ప్రకటించారు. కాని నాని నటించిన `ఎం.సి.ఎ.`, అలాగే అఖిల్ హీరోగా హలో` సినిమాలు వరుసగా డిసెంబరు 21, 22 తేదీల్లో విడుదల అవుతున్నాయి. అందుకే ఈ సినిమాని డిసెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాతలు తెలియచేసారు. సురభి హీరోయిన్‌గా నటించిన చిత్రంలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, సీర‌త్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మణిశర్మ బాణీలు అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.