close
Choose your channels

మ‌ళ్ళీ పోటీప‌డుతున్నారు

Friday, May 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ళ్ళీ పోటీప‌డుతున్నారు

మరోసారి ఓ యంగ్ హీరోతో ఓ సీనియర్ హీరో పోటీ పడుతున్నారు. గతంలో ఇలా పోటీకి దిగిన సంద‌ర్భంలో విజయం యంగ్ హీరోనే వరించింది. ఈ నేప‌థ్యంలో.. ఈసారి ఇద్దరూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను టచ్ చేస్తూ ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ హీరోలు, సినిమాల వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఈ సినిమాతో ఉత్తరాది భామ మాళవికా శర్మ కథానాయికగా పరిచయం కానుంది. రామ్ తాళ్ళూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.

కాగా.. ఇదే రోజున నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ సూర్య దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాని కె.ఆర్. రాజేష్ నిర్మించారు. అయితే.. గతంలో కూడా ఒకే రోజు విడుదలైన ఈ హీరోల సినిమాల్లో విజయం నాగశౌర్యని వరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న రవితేజ హీరోగా డెబ్యూ డైరెక్టర్ విక్రమ్ సిరికొండ రూపొందిన‌ ‘టచ్ చేసి చూడు’ విడుదలైంది. ఈ సినిమా రవితేజకు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. కాగా.. అదే రోజున విడుదలైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోనే పెద్ద హిట్టుగా నిలిచింది. మరిప్పుడు మరోసారి ఒకే రోజున వస్తున్న ఈ ఇద్దరి హీరోల సినిమాల్లో.. ఏ హీరోని విజయం వరిస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.