close
Choose your channels

ఎంట‌ర్ టైన్మెంట్ - ఫ్యామిలీ ఎమోష‌న్స్ ప్ర‌త్యేకార్ష‌ణ‌గా అంద‌ర్నీ ఆక‌ట్టుకునే చిత్రం సావిత్రి - డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని

Wednesday, March 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా రోహిత్ - నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం సావిత్రి. ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. విజ‌న్ ఫిల్మ్ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏప్రిల్ 1న సావిత్రి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా సావిత్రి ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేనితో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

సావిత్రి క‌థ ఏమిటి..?

సావిత్రి (నందిత‌) ఓ పెళ్లిలో పుడుతుంది. అందుక‌నే సావిత్రికి చిన్న‌ప్ప‌టి నుంచి పెళ్లంటే ఇష్టం. రుషి (నారా రోహిత్ ) సావిత్రిని చూసి తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. పెళ్లంటే బాగా ఇష్టం ఉన్న అమ్మాయి లైఫ్ లోకి రుషి ఎంట‌ర్ అయిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది క‌థ‌. ప్ర‌తి సీన్ ఇంట్ర‌స్టింగ్ గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటుంది.

పెళ్లి నేప‌ధ్యంతో చాలా సినిమాలు వ‌చ్చాయి క‌దా..? ఇందులో ఉన్న కొత్త‌ద‌నం ఏమిటి..?

నిజ‌మే..పెళ్లి మీద చాలా సినిమాలు వ‌చ్చాయి. అందులో పెళ్లి కి ముందు ఆత‌ర్వాత రిలేష‌న్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. పెళ్లి నేప‌ధ్యంతో వ‌చ్చిన చిత్రాల‌తో పోలిస్తే...ఇందులో చాలా కొత్త‌ద‌నం ఉంటుంది.

సావిత్రి క‌థ‌కి స్పూర్తి ఏమిటి..?

నాకు పెళ్లి కుదిరిన‌ప్పుడు బాడీ ఫిట్ నెస్ కోసం జిమ్ కి వెళ్లేవాడిని. కొంతమంది అమ్మాయిలు కూడా జిమ్ కి వ‌చ్చేవారు. ఆ అమ్మాయిలు కూడా పెళ్లి గురించి ఆలోచించే జిమ్ కి వ‌చ్చేర‌నుకున్నాను. ఆ స‌మ‌యంలో వ‌చ్చిన ఆలోచ‌నే సావిత్రి క‌థ‌కి స్పూర్తి.

నారా రోహిత్ సినిమాకి సావిత్రి అని టైటిల్ పెట్టారు..రిస్క్ అనిపించ‌లేదా..?

సావిత్రి అంటే తెలియ‌ని వాళ్లు ఎవ‌రుంటారు. సావిత్రి గారు అంటే క్లాస్ ఆడియోన్స్ మాస్ ఆడియోన్స్ అనే తేడా లేకుండా అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే సావిత్రి అని టైటిల్ పెట్ట‌డం వ‌ల‌నే మాకు బిజినెస్ ప‌రంగా హెల్ప్ అయ్యింది. అందుచేత ఏమాత్రం రిస్క్ కాదు. అలాగే ఈ సినిమా క‌థ అనుకున్న‌ప్పుడే సావిత్రి టైటిల్ అనుకున్నాను. వేరే టైటిల్ పెట్టాల‌నే ఆలోచ‌న కూడా రాలేదు.

అస‌లు..సావిత్రి అని టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఏమిటి..?

క‌థ‌లో తెలుగుద‌నం ఉంటుంది. అలాగే ఇది సావిత్రి జీవితం. క‌నుక క‌థ‌క‌నుగుణంగానే సావిత్రి అని టైటిల్ పెట్టాను.

హీరో నారా రోహిత్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

నారా రోహిత్ క్యారెక్ట‌ర్ పేరు రుషి. ఇత‌నికి మ‌నుషుల‌ను బాగు చేయ‌డం ఇష్టం అందుకే మెడిషిన్ చ‌దువుతుంటాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయ‌డానికైనా రెడీ అనేట్టుగా రోహిత్ క్యారెక్ట‌ర్ ఉంటుంది. త‌న గ‌త చిత్రాల‌కు భిన్నంగా క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సావిత్రి ఒక స‌మ‌స్య‌ అయితే రుషి ఒక ప‌రిష్కారం..ఇలా ఉంటుంది అత‌ని క్యారెక్ట‌ర్.

సావిత్రి సినిమాకి నందిత‌ని ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి..?

సావిత్రి అని టైటిల్ పెట్టాం క‌నుక‌ ముంబాయి హీరోయిన్ ని పెట్ట‌లేం. తెలుగ‌మ్మాయి అయ్యిండాలి. కాస్త తింగ‌రిత‌నం ఉండాలి. అది నాకు నందిత‌లో క‌నిపించింది. అందుకే నందిత‌ని సావిత్ర హీరోయిన్ గా సెలెక్ట్ చేసాం.

సావిత్రి సినిమాలో హైలెట్స్ ఏమిటి..?

ఎంట‌ర్ టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఈ చిత్రానికి హైలెట్స్ గా నిలుస్తాయి.

ఏప్రిల్ 1న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి క‌దా..మీ సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తుంది అనుకుంటున్నారు..?

సంక్రాంతి పండ‌గ‌కి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాలు స‌క్సెస్ అయ్యాయి. అదీ కాకుండా ఇప్పుడు స‌మ్మ‌ర్ హాలీడేస్ క‌నుక ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సినిమా బాగుంటే చూస్తారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా కాబ‌ట్టి సావిత్రి సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది.

ప్రేమ ఇష్క్ కాద‌ల్ త‌ర్వాత గ్యాప్ రావ‌డానికి కార‌ణం ఏమిటి..?

ప్రేమ ఇష్క్ కాద‌ల్ సినిమా కంటే ఎక్కువ బ‌డ్జెట్ తో తీసిన సినిమా ఇది. ఆర్టిస్టులు కూడా ఆ సినిమా కంటే ఈ సినిమాలో ఎక్కువ‌. క‌థ చెప్పిన త‌ర్వాత హీరో, ఇత‌ర న‌టీన‌టులు సెట్ అయితే స‌రిపోదు. ఇంకా చాలా వ‌ర్క్ ఉంటుంది. అలాగే అంద‌రికీ న‌చ్చే ఒక మంచి సినిమా అందించాల‌నుకున్నాను. అందుక‌నే గ్యాప్ వ‌చ్చింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?

ప్ర‌స్తుతం డిష్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. సావిత్రి రిలీజ్ త‌ర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.