close
Choose your channels

రేడియో సిటీ లో 'ప్రేమ పిపాసి' ఫస్ట్ సింగిల్ లాంచ్

Saturday, December 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేడియో సిటీ లో ప్రేమ పిపాసి ఫస్ట్ సింగిల్ లాంచ్

ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి` .పి.ఎస్‌.రామ‌కృష్ణ (ఆర్ .కె ) ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ముర‌ళీరామ‌స్వామి ( ఎమ్ ఆర్ ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిపిఎస్‌, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ‌ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లోని `బుంగమూతి పిల్లదాన `` అనే ఫస్ట్ సింగిల్ ని రేడియో సిటీలో లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత .పి.ఎస్‌.రామ‌కృష్ణ మాట్లాడుతూ ...``లహరి ఆడియో ద్వారా మార్కెట్ లోకి పాటలు విడుదల చేస్తున్నాం. ఈ రోజు రేడియో సిటీ లో మా సినిమా లోని `బుంగమూతి పిల్లదాన ` అనే ఫస్ట్ సింగిల్ లాంచ్ చేసాము. సాంగ్ వినడానికి ఎంత బావుటుందో విజువల్ గా కూడా అంత బావుంటుంది. ప్రెసెంట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ లో ఉన్నాయి . అన్ని పనులు పూర్తి చేసి ఫిబ్రవరి లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

డైరెక్టర్ మురళి రామ స్వామి మాట్లాడుతూ....``ఇటీవల కాలం లో అమ్మాయిల పై జరుగుతున్న అకృత్యాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అమ్మాయిలను ప్రేమించాలి, టీజ్ చేయాలి కానీ ఏది శృతి మించేలా ఉండకూడదు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు . ఇక ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ కూడా స్వీట్ టీజింగ్ సాంగ్. ఒక అబ్బాయి తన ప్రేమను ఒక అమ్మాయితో ఎంతో బుజ్జి గా, ముద్దుగా వ్యక్త పరుస్తాడు. కచ్చితంగా యూత్ కి నచ్చే సాంగ్. ఆర్స్ గారు అద్భుతమైన ట్యూన్ ఇస్తే.. దానికి సురేష్ ఉపాధ్యాయ యూత్ ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. సెకండ్ సింగల్ ని ఈ నెలాఖరు లో రిలీజ్ చేసి త్వరలో ట్రెండీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం``అన్నారు.

కో -ప్రొడ్యూసర్ రాహుల్ పండిట్ మాట్లాడుతూ...``బుంగమూతి పిల్లదాన ` సాంగ్ నాకు చాలా ఇస్టమైన సాంగ్. మంచి మ్యూజిక్ , మంచి లిరిక్స్ కుదిరాయి. అందరికి నచ్చే సాంగ్ అవుతుంది `` అన్నారు.

రేడియో సిటీ లో ప్రేమ పిపాసి ఫస్ట్ సింగిల్ లాంచ్

హీరో జిపియస్ మాట్లాడుతూ...``ఇటీవల విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్, టిక్ టాక్ లలో డైలాగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ రోజు రేడియో సిటీ లో `బుంగమూతి పిల్లదాన` సాంగ్ రిలీజే చేసాం . అర్స్ మ్యూజిక్, సురేష్ ఉపాధ్యాయ లిరిక్స్ పోటాపోటీగా ఉంటాయి. మంచి యూత్ ఫుల్ సాంగ్. `ఢీ జోడి ` ఫేమ్ కన్నా ఈ పాటకు అద్భుతం గా కొరియోగ్రఫీ చేసారు`` అన్నారు .

లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ...` నేనొక ప్రేమ పిపాసిని `. ఈ సాంగ్ ఎంత ఫేమస్సో అందరికి తెలిసిందే . నాకు ఎంతో ఇష్టమైన సాంగ్. ఆ పాటలో పల్లవిని తీసుకొని `ప్రేమ పిపాసి` అనే టైటిల్ తో మురళి రామ స్వామి గారు యూత్ ఫుల్ సినిమా చేస్తున్నారు. ఇందులో నాతో నాలుగు సాంగ్స్ రాయించారు. ``బుంగమూతి పిల్లదానా `` అంటూ సాగే స్వీట్ టీజింగ్ సాంగ్ అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది . ఆర్స్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు`` అన్నారు

జిపిఎస్ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్ పుత్, మమత శ్రీ చౌదరి, `ఢీ జోడి ఫేమ్` అంకిత , బిగ్ బాస్ ఫేమ్ బందగీ కర్ల , సంజన చౌదరి , సుమన్ , భార్గవ్ , షేకింగ్ శేషు, జబ్బర్దస్థ్ రాజమౌళి, ఫసక్ శశి, ఫన్ బకెట్ భరత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీ తిరుమల రోడ్రిగ్జ్ , మ్యూజిక్: ఆర్స్ , పాటలు : సురేష్ ఉపాధ్యాయ-అల రాజు, సౌండ్ డిజైన్ :యతిరాజ్ , పీఆర్వో : వంగాల కుమారస్వామి , ఎడిటర్: ఎస్ శివ కిరణ్, ఫైట్స్: మిస్టర్ దేవ్, కో-ప్రొడ్యూసర్స్ : రాహుల్ పండిట్, జిఎస్ రావు, వై వెంకట లక్ష్మి , అస్సోసియేట్ ప్రొడ్యూసర్ :యుగంధర్ కొడవటి , ప్రొడ్యూసర్ : పియస్ రామకృష్ణ (ఆర్కే), రచన-దర్శకత్వం: మురళి రామస్వామి (ఎమ్ .ర్ ).

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.