close
Choose your channels

పూరి మాటే పవన్ టైటిల్..

Friday, June 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆకుల శివ క‌థ అందించ‌గా...అనూప్ సంగీతం అందిస్తున్నారు. ఓ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ గ‌తంలో ప్ర‌క‌టించింది.
ఈ చిత్రానికి హుషారు అనే టైటిల్ పెడుతున్న‌ట్టు గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే...తాజా స‌మాచారం ప్ర‌కారం డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలో ఓ డైలాగ్ లోని ప‌దాన్నే ప‌వ‌న్ చిత్రానికి టైటిల్ గా పెడుతున్నార‌ట‌. ఇంత‌కీ.. ప‌వ‌న్ చిత్రానికి టైటిల్ గా మారిన ఆ ప‌దం ఏమిటి అంటారా..? పూరి తెర‌కెక్కించిన పోకిరి చిత్రంలో షాయాజీ షిండే...మీడియా ప్ర‌తినిధులుతో మాట్లాడే ఓ స‌న్నివేశంలో...గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడ‌దు. క‌డ‌ప కింగ్ అని తీయ్ 200 సెంట‌ర్స్ 100 డేస్ అని అంటారు. ఇప్పుడు ఈ డైలాగ్ లోని క‌డ‌ప కింగ్ అనే ప‌దాన్నే ప‌వ‌న్ - ఎస్.జె.సూర్య చిత్రానికి టైటిల్ గా పెట్టాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇదే క‌నుక జ‌రిగితే...పూరి మాటే ప‌వ‌న్ టైటిల్...ఈచిత్రం భ‌ళారే విచిత్రం

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.