close
Choose your channels

ప్రభాస్, పూజాల రొమాంటిక్ స్టిల్‌తో ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్

Friday, July 10, 2020 • తెలుగు Comments

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ప్రభాస్ 20వ చిత్రానికి ముందుగా ఊహించనట్టే ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నేడు చిత్రబృందం వదిలింది. ప్రభాస్, పూజాహెగ్డేల రొమాంటిక్ స్టిల్‌ను ఫస్ట్‌లుక్‌గా చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌‌లో హీరో, హీరోయిన్‌లకు సంబంధించిన స్టిల్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. గుల్ష‌న్ కుమార్‌, టీ సిరీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘రాధేశ్యామ్’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మళయాల భాషల్లోనూ తెరకెక్కుతోంది. దీంతో ఈ నాలుగు భాషల్లోనూ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఫస్ట్‌లుక్‌ని బట్టి చూస్తే చిత్రంలో ప్రభాస్, పూజాల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని తెలుస్తోంది. దీనికి ముందు చేసిన ‘సాహో’ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ప్రభాస్ ఈ సినిమాపై మరింత దృష్టిని సారిస్తున్నాడు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’ను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్టుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Get Breaking News Alerts From IndiaGlitz