close
Choose your channels

రకుల్ కి తమన్ ఈసారైనా అచ్చొస్తాడా?

Saturday, April 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కెరీర్ ప్రారంభంలో రెండు వ‌రుస విజ‌యాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఆ త‌రువాతే ఆమెకు అస‌లు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్నా.. హిట్ స్టేట‌స్ రిజ‌ల్ట్స్ అయితే ఆ భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్‌తో న‌టిస్తున్న 'స‌రైనోడు 'పై ర‌కుల్ బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకుంది. ఈ నెల 22న రానున్న ఈ సినిమా కోసం అంద‌రి కంటే ఎక్కువ ఆస‌క్తితో ఎదురుచూస్తోందీ ముద్దుగుమ్మ‌.
త‌మ‌న్ సంగీతమందించిన ఈ సినిమా పాట‌లు ఈ రోజే మార్కెట్‌లోకి నేరుగా విడుద‌ల‌య్యాయి. ఇదిలా ఉంటే.. గ‌తేడాది ర‌కుల్ న‌టించగా మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటిలో ఏ సినిమా హిట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకోలేదు. విశేష‌మేమిటంటే ఆ సినిమాల‌న్నింటికీ త‌మ‌నే స్వ‌ర‌క‌ర్త‌. త‌న‌కు క‌లిసి రాని త‌మ‌న్ సంగీతంలో మ‌రోసారి 'స‌రైనోడు' కోసం న‌టించిన ర‌కుల్‌కి ఈ సారైనా హిట్ దొరుకుతుందేమో చూడాలంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.