close
Choose your channels

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న రామ్ చరణ్ పోస్టర్స్

Thursday, November 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చ‌ర‌ణ్ కొత్త ఐడియా

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విన‌య‌విధేయ రామ‌`. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నారు. కాగా ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ కొత్త ర‌కం ప‌బ్లిసిటీని స్టార్ట్ చేయ‌నుంది. అఖిల భార‌త చిరంజీవి యువ‌త‌, క‌డ‌ప జిల్లా చిరంజీవి యువ‌త క‌లిసి డిసెంబ‌ర్ 6న ఓ బైక్ ర్యాలీ చేయ‌బోతున్నారు.

ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఏదైతేనేం వినూత్నంగా చేయ‌బోయే ఈ ప్ర‌క్రియ సినిమాకు పబ్లిసిటీని తేవ‌డంలో మాత్రం క‌చ్చితంగా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌నడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని దాన‌య్య డి.వి.వి నిర్మిస్తున్నారు. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.