close
Choose your channels

టీవీ9 రవిప్రకాష్ ఇకపై షేర్ హోల్డర్ మాత్రమే... 

Friday, May 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీవీ9 రవిప్రకాష్ ఇకపై షేర్ హోల్డర్ మాత్రమే... 

హైదరాబాద్: టీవీ9 సీఈవోగా రవిప్రకాష్‌ను తొలగించిన అనంతరం అలంద మీడియా సభ్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసలు టీవీ9లో ఏం జరిగింది..? రవిప్రకాష్ నిజంగానే సంతకం ఫోర్జరీ చేశారా..? లేదా..? కొత్త సీఈవో, సీఓఓ అధికారిక ప్రకటన లాంటి విషయాలను స్పష్టంగా మీడియాకు వివరించింది. కాగా అంతకముందు టీవీ9 కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమయ్యారు. ప్రెస్‌మీట్‌లో భాగంగా తమ వాదనను అలంద మీడియా వినిపించింది.

ఇదిలా ఉంటే.. సీఈవోగా తొలగింపు అనంతరం రవిప్రకాష్ లేఖ రాయగా.. ఇందుకు బదులుగా అలంద మీడియా సైతం మరో లేఖను విడుదల చేసింది. పోటాపోటీగా లేఖలు విడుదల చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కినట్లైంది.

అలంద మీడియా వాదన ఇదీ...

కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశారు.

నిబంధనల ప్రకారం చేయాల్సిన పత్రాలను రవిప్రకాష్ సమర్పించలేదు.

రవిప్రకాష్ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారు.

బాధ్యతల నిర్వహణకు రవిప్రకాష్ అడ్డుతగిలారు.

రవిప్రకాష్, టీవీ9 మూర్తికి ఎలాంటి సంబంధంలేదు.

జర్నలిజం విలువలకు మేం కట్టుబడి ఉంటాం.

అంకితభావంతో పనిచేసి అంచనాలను నిలబెట్టుకుంటాం.

ఇక పై షేర్ హోల్డర్ మాత్రమే...

రవిప్రకాష్‌ను సీఈవోగా తొలగిస్తూ మే-08న నిర్ణయం తీసుకున్నామని ఇకపై ఆయన షేర్ హోల్డర్‌గా మాత్రమే కొనసాగుతారని డైరెక్టర్ సాంబశివారావు తెలిపారు. ఇవాళ ఈజీఎం నిర్వహించామని టీవీ9 నియంత్రణను మా పరిధిలోకి తీసుకున్నామని సాంబశివారావు స్పష్టం చేశారు. టీవీ9 సీఈవోగా మిశ్రాను సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించామని తెలిపారు. "తొమ్మిది నెలలక్రితం ఏబీసీఎల్‌లోని 90.5 శాతం షేర్లను అలంద మీడియా కొనడం జరిగింది.

అలంద మీడియాలో నలుగురు డైరెక్టర్లు ఉన్నారు. మార్చిలో మాకు కేంద్రం నుంచి అప్రూవల్స్ వచ్చింది. టీవీ9లో వాటా కొన్న తర్వాత మాకు అనేక అవరోధాలు కలిగించారు. బోర్డు సమావేశాలు నిర్వహించాలని రవిప్రకాష్, మూర్తిలకు పదేపదే సూచించినా కారణాలు చెప్పి తప్పించుకునేవారు. ఇవాళ నిర్వహించిన షేర్ హోల్డర్స్ సమావేశానికి కూడా రవిప్రకాష్ హాజరు కాలేదు. 8శాతం వాటా ఉన్న వాళ్లు యాజమాన్యాన్ని నియంత్రించాలని చూశారు. కంపెనీలో ఎవరికైతే 50శాతానికి పైగా వాటా ఉంటుందో వారికే నియంత్రణ బాధ్యతలు ఉంటాయి" అని అలంద మీడియా డైరెక్టర్ సాంబశివరావు స్పష్టం చేశారు.

రవిప్రకాష్ వాట్ నెక్స్ట్..!?
సో.. రవిప్రకాష్ ఇకపై సీఈవో కాదు.. చైర్మన్, ఫౌండర్‌గా పూర్తిగా తొలిగించారన్న మాట. అయితే ఇప్పుడు రవిప్రకాష్‌కు టీవీ9 స్థానమేంటి..? ఆయన సాధారణ ఉద్యోగిగానే అక్కడ కొనసాగుతారా..? బయటికొచ్చేసి షేర్‌ హోల్డర్‌గా మిగిలిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.

రేపట్నుంచి ఇక సీఈవోగా మహింద్రా మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావు రంగంలోకి దిగుతారన్న మాట. ఒకప్పుడు రవిప్రకాష్ అంటే టీవీ9.. టీవీ9 అంటే రవిప్రకాష్‌గా పేరుండేది.. అయితే కొత్త యాజమాన్యం, సీఈవో ఎలా రాణిస్తారో.. నంబర్ వన్ స్థానంలో టీవీ9 అదేస్థానంలో ఉంచుతారా..? ఎక్కడికో తీసుకెళ్తారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.