close
Choose your channels

'డిస్కోరాజా' షూటింగ్ ఎప్పుడంటే..

Tuesday, February 12, 2019 • తెలుగు Comments

డిస్కోరాజా షూటింగ్ ఎప్పుడంటే..

`డిస్కోరాజా` అంటూ మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప‌ట్స్‌ని  త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

అయితే ఎప్పుడో సెట్స్‌కు వెళ్లాల్సిన ఈ సినిమా కొన్ని కార‌ణాల‌తో పోస్ట్ పోన్ అయ్యింది. ఎట్ట‌కేల‌కు మార్చి 4 నుండి హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్ 10 రోజుల పాటు జ‌రుగ‌నుంది. రివేంజ్ డ్రామాగా తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో ర‌వితేజ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌బోతున్నారు. న‌భాన‌టేశ్‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz