close
Choose your channels

సైరాలో బోజ్‌పురి న‌టుడు...

Thursday, November 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బోజ్‌పురిలో స్టార్ న‌టుడిగా పేరు తెచ్చుకున్న ర‌వికిష‌న్ తెలుగులో 'రేసుగుర్రం' చిత్ంతో ఎంట్రీ ఇచ్చాడు. త‌ర్వాత కిక్ 2, సుప్రీమ్ చిత్రాల్లో న‌టించి త‌న‌దైన విలనిజాన్ని తెర‌పై ఆవిష్క‌రించాడు.

ఇప్పుడు ఈ న‌టుడు చిరంజీవి 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రంలో న‌టించబోతున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాను దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నాడు.

అమితాబ్‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార వంటి తార‌లు అల్రెడి ఈ సినిమాలో న‌టిస్తున్నారు. కాగా ఇప్పుడు వీరితో ర‌వికిష‌న్ కూడా జ‌త క‌డుతున్నాడు. డిసెంబ‌ర్ 6న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.